Sajid Mir: నరరూప రాక్షసుడు బతికే ఉన్నాడు.. ముంబై పేలుళ్ల సూత్రధారి సాజిద్‌ను అరెస్ట్ చేసిన పాకిస్తాన్..

సాజిద్ చనిపోయాడని గతంలో ప్రకటించిన పాకిస్తాన్.. ఇప్పుడు అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొనడం మరింత చర్చనీయాంశంగా మారింది. పాక్‌లోని రావల్పిండిలో జీవిస్తున్న సాజిద్‌.. మళ్లీ ఉగ్ర కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది.

Sajid Mir: నరరూప రాక్షసుడు బతికే ఉన్నాడు.. ముంబై పేలుళ్ల సూత్రధారి సాజిద్‌ను అరెస్ట్ చేసిన పాకిస్తాన్..
Terrorist Sajid Mir
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jun 25, 2022 | 5:53 AM

26/11 attacks mastermind: 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి సాజిద్‌ మీర్‌ ఇప్పటికీ బతికే ఉన్నాడు. చనిపోయాడనుకున్న సాజిద్‌.. పాక్‌లో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. సాజిద్‌ చనిపోలేదని.. ఐఎస్‌ఐ రక్షణలో స్వేచ్ఛగా జీవనం సాగిస్తున్నాడంటూ ఓ వార్తా సంస్థ సంచలన కథనాన్ని వెలువరించింది. ఇప్పుడీ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. అయితే.. సాజిద్ చనిపోయాడని గతంలో ప్రకటించిన పాకిస్తాన్.. ఇప్పుడు అతన్ని అరెస్టు చేసినట్లు పేర్కొనడం మరింత చర్చనీయాంశంగా మారింది. పాక్‌లోని రావల్పిండిలో జీవిస్తున్న సాజిద్‌.. మళ్లీ ఉగ్ర కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. ఉగ్రవాద విస్తరణకు సాజిద్‌ ప్రణాళికలు రచిస్తున్నాడు. మరోసారి ఉగ్రదాడులకు సాజిద్‌ పన్నాగం పన్నుతున్నాడన్న వార్తలు వెలువడుతున్నాయి. ఈసారి ఆస్ట్రేలియా, వర్జినియా, అమెరికా, ఫ్రాన్స్‌లలో ఉగ్ర దాడులకు కుట్రలు చేస్తున్నట్టు సమాచారం.

సాజిద్‌ బతికే ఉన్నా.. ముంబై పేలుళ్ల మరో సూత్రధారి మసూద్‌ అజార్‌ జాడ మాత్రం కరువైంది. మసూద్‌ బహవాల్‌పూర్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే మసూద్‌ జాడపై కచ్చితమైన సమాచారం మాత్రం లేదు. కాగా.. మోస్ట్ వాంటెడ్ సాజిద్ మీర్ కోసం భారత్, అమెరికా గత కొన్నేళ్లుగా కోసం వెతుకుతున్నాయి. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాతో సాజిద్ మీర్‌కు సంబంధం ఉంది. మీర్ లష్కరే నాయకుడు హఫీజ్ మహ్మద్ సయీద్‌కు సన్నిహితుడు. అయితే.. డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ సహా ఇతర ఉగ్రవాదులతో కలిసి సాజిద్ మీర్ ముంబైలో ఉగ్రదాడికి ప్లాన్ చేశాడు.

ఓవైపు పాకిస్థాన్‌పై ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఆంక్షల కత్తి వేలాడుతోంది. ఇప్పటికీ పాకిస్థాన్‌ గ్రే లిస్టులోనే కొనసాగుతోంది. ఈ ఆంక్షల ఫలితంగా.. పాకిస్థాన్‌ అనేక అవరోధాలు ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాల్లో పాకిస్థాన్‌పై చులకనభావం ఏర్పడింది. దేశంలో ఉగ్ర కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తేనే.. గ్రే లిస్టు నుంచి తొలగిస్తామని స్పష్టంగా చెబుతోంది FATF. అయినప్పటికీ.. సాజిద్‌, మసూద్‌ అజార్‌ లాంటి వాళ్లకు ఆశ్రయం కల్పిస్తూ అపవాదు మూట్టకట్టుకుంటోంది పాకిస్థాన్‌. ఈ పరిస్థితుల్లో గ్రే లిస్టు నుంచి బయటపడడం ఆ దేశానికి అంత ఈజీ కాకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..