Viral Video: పాన్-స్లాపింగ్ కాంటెస్ట్.. ఒకరి తలపై ఒకరు పాన్ తో కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. వీడియో వైరల్..

ఇద్దరు వ్యక్తులు తలకు మెటల్ నైట్ హెల్మెట్‌లను ధరించారు. పాన్ తో ఒకరినొకరు కొట్టుకున్నారు. అయితే ఈ సమయంలో తలకు తీవ్రమైన గాయాలు కాకుండా వారి తలలను హెల్మెట్ కాపాడుతుంది.

Viral Video: పాన్-స్లాపింగ్ కాంటెస్ట్.. ఒకరి తలపై ఒకరు పాన్ తో కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. వీడియో వైరల్..
Pan Slapping Contest
Follow us

|

Updated on: Jun 22, 2022 | 7:43 PM

Viral Video: ఇద్దరు పురుషుల మధ్య “పాన్-స్లాపింగ్ కాంటెస్ట్” పోటీ జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఇది రెండు మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ ను, వేల సంఖ్యలో లైక్‌లను పొందింది.  “పాన్-స్లాపింగ్ కాంటెస్ట్” అనే విచిత్రమైన పోటీలో ఇద్దరు వ్యక్తులు పాల్గొని ఓ రేంజ్ లో కొట్టుకున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. మాజీ NBA ఆటగాడు రెక్స్ చాప్‌మన్ షేర్ చేసిన ఈ వీడియో క్లిప్‌లో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తలపై కొట్టుకోవడం..  చిన్న గుంపు వీక్షించడం కనిపిస్తుంది. పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు తలకు మెటల్ నైట్ హెల్మెట్‌లను ధరించారు. పాన్ తో ఒకరినొకరు కొట్టుకున్నారు. అయితే ఈ సమయంలో తలకు తీవ్రమైన గాయాలు కాకుండా వారి తలలను హెల్మెట్ కాపాడుతుంది. ఇద్దరు పోటీ దారుల్లో ఒకరు కూర్చున్న ప్లేస్ నుంచి నేలమీదకు పడే వరకూ ఈ పాన్ తో కొట్టుకునే పోటీ కొనసాగింది. ఒకరు చేతులు పైకెత్తే వరకు ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉన్నారు.

ఈ వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఈ వీడియో క్లిప్‌పై స్పందిస్తూ..నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ పాన్-స్లాపింగ్ పోటీ.. వింత పోటీ మాత్రమే కాదు. గత మార్చిలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ స్థాపించిన ఆర్నాల్డ్ స్పోర్ట్స్ ఫెస్టివల్ “స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్”లో మొదలు పెట్టారు.

అధికారిక నిబంధనల ప్రకారం.. ప్రతి రౌండ్‌లో ఒక్కో పోటీదారుడు.. మూడు సార్లు కొట్టించుకోవాలి.. ఇలా మూడు రౌండ్‌లపాటు ఈ పోటీ జరుగుతుంది. చెంపదెబ్బ తగిలిన 30 సెకన్లలోపు పోరాటాన్ని కొనసాగించగలగాలి. ఆటగాడి సామర్థ్యం ఆధారంగా నాకౌట్‌ను ముగ్గురు న్యాయమూర్తులు స్కోర్ ఇస్తారు. అయితే ఈ “స్లాప్ ఫైటింగ్ ఛాంపియన్‌షిప్” కంటే ముందు మొట్టమొదటి ప్రొఫెషనల్ “పిల్లో ఫైటింగ్ ఛాంపియన్‌షిప్” కూడా జనవరి 2022లో యునైటెడ్ స్టేట్స్‌లో జరిగింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..