Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mother of 44 Children: 40 ఏళ్ల వయసు.. 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. భారీ కుటుంబాన్ని పోషించలేక భర్త ఇంటినుంచి పరారీ

ఈ కలియుగ గాంధారీ మహిళ ఒంటరిగా 44 మంది పిల్లలను పెంచుతుంది. ఈ మహిళలు ఎవరు , ఎక్కడ నివసిస్తుంది.. ఇంత మంది పిల్లలు పుట్టడానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం..

Mother of 44 Children: 40 ఏళ్ల వయసు.. 44 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. భారీ కుటుంబాన్ని పోషించలేక భర్త ఇంటినుంచి పరారీ
Mariam Nabatanzi
Follow us
Surya Kala

|

Updated on: Jun 29, 2022 | 5:42 AM

Mother of 44 Children: ప్రపంచం నలుమూల జరిగిన ఎన్నో రకాల వింత ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ 40 ఏళ్లలోపు 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ మహిళ గర్భనిరోధకం పద్ధతులు కానీ  కుటుంబ నియంత్రణ పద్ధతి పనిచేయదని వైద్యులు చెప్పారు. అదే సమయంలో.. పిల్లలు పుట్టడం ఆపేస్తే.. ఆ మహిళ  తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని… లేదా చనిపోయే ప్రమాదం ఉందని కూడా వైద్యులు హెచ్చరించారు. ఈ కలియుగ గాంధారీ మహిళ ఒంటరిగా 44 మంది పిల్లలను పెంచుతుంది. ఈ మహిళలు ఎవరు , ఎక్కడ నివసిస్తుంది..  ఇంత మంది పిల్లలు పుట్టడానికి కారణం ఏమిటి? తెలుసుకుందాం..

న్యూయార్క్ పోస్ట్ వెబ్‌సైట్ కథనం ప్రకారం..  44 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పేరు మరియం నబటాంజీ. తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాకు చెందినది. ఆమెకు ఇప్పుడు 43 ఏళ్లు.. 40 ఏళ్ల నాటికి 44 మంది పిల్లలకు జన్మనిచ్చింది. మరియం ఒక్కసారి మాత్రమే ఒకే బిడ్డకు జన్మనిచ్చింది. ఒకసారి నలుగురు కవలలకు జన్మనివ్వగా.. ఐదుసార్లు  ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. నాలుగు సార్లు ఐదుగురు పిల్లలు జన్మించారు. వీరిలో ఆరుగురు పిల్లలు చనిపోయారు. సజీవంగా ఉన్న 38 మంది పిల్లలున్నారు. వీరిలో 20 మంది అబ్బాయిలు, 18 మంది బాలికలు ఉన్నారు. ఇంతమంది సంతానాన్ని  మరియం ఒంటరిగా పెంచుతోంది.

మరియంకి 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. ఆమె తల్లిదండ్రులు పెళ్లి సాకుతో ఒక వ్యక్తికీ అమ్మేశారు. 13 సంవత్సరాల వయస్సులో.. మరియం మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. మొదటి బిడ్డ పుట్టిన తరువాత.. మరియం సంతానోత్పత్తి ఇతర మహిళల కంటే ఎక్కువగా ఉందని గ్రహించింది. చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత వైద్యుడి వద్దకు వెళ్లింది.. అప్పుడు ఆమె పరిస్థితి గురించి డాక్టర్ చెప్పారు. ఆమె అండాశయాలు అసాధారణంగా పెద్దవిగా ఉన్నాయని వైద్యులు మరియంకి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఈ పరిస్థితి ఆమె శరీరంలో హైపర్‌ఓవిలేషన్ అనే పరిస్థితికి దారితీసింది. హైపర్-అండాశయ పరిస్థితి జన్యుపరమైనది. ఈ పరిస్థితిలో.. ఎక్కువ మంది పిల్లలు పుట్టే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి. ఉగాండా రాజధాని కంపాలాలోని ముల్గో హాస్పిటల్‌లోని గైనకాలజిస్ట్ డాక్టర్ చార్లెస్ కిగ్గుండు ఇదే విషయంపై స్పందిస్తూ.. మరియంలో సంతానోత్పత్తి సామర్ధ్యం చాలా ఎక్కువగా ఉంది.. ఈ పరిస్థితికి కారణం వంశపారంపర్యత అని చెప్పారు. వారి విషయంలో అండాశయాలు ఒకేసారి అనేక అండాలను విడుదల చేస్తాయని చెప్పారు. ఈ కారణంగా ఆమెకు చాలా మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. అయితే ఎక్కువమంది పిల్లలు పుట్టడంతో భారీ కుటుంబాన్ని పోషించలేక భర్త ఇంటి నుంచి పారిపోయాడు. దీంతో మరియం ఒంటరిగా పిల్లల్ని సాకుతోంది. ఓ వైపు పిల్లలను చూసుకుంటూ డబ్బు సంపాదిస్తూ కాలం గడిపేస్తుంది. ఆమె తన పిల్లలను పెంచడానికి కటింగ్, జంక్ సేకరించడం, మందులు అమ్మడం వంటి చాలా పని చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..