AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 : ఐపీఎల్ 2026 రికార్డుల జాతర.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన ముగ్గురు దిగ్గజాలు

IPL 2026 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ముంగిట ఉంది. మార్చి 28 నుంచి టీ20 క్రికెట్ పండుగ షురూ కాబోతోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఎన్నో రికార్డులు బద్ధలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

IPL 2026 : ఐపీఎల్ 2026 రికార్డుల జాతర.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన ముగ్గురు దిగ్గజాలు
Ipl 2026
Rakesh
|

Updated on: Mar 16, 2026 | 11:37 AM

Share

IPL 2026 : క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) ముంగిట ఉంది. మార్చి 28 నుంచి టీ20 క్రికెట్ పండుగ షురూ కాబోతోంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఎన్నో రికార్డులు బద్ధలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. సాధారణంగా ఐపీఎల్ అనగానే ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించే బ్యాటర్ల గురించే అంతా మాట్లాడుకుంటారు. కానీ, ఈ సీజన్ మాత్రం బౌలర్ల రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 200 వికెట్ల క్లబ్‌లో చేరిన బౌలర్ ఒక్క యుజ్వేంద్ర చహల్ మాత్రమే. అయితే ఈ 2026 సీజన్‌లో చహల్ సరసన మరో ముగ్గురు దిగ్గజ బౌలర్లు చేరే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది.

ఈ అరుదైన మైలురాయికి అత్యంత చేరువలో ఉన్న బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అందరికంటే ముందున్నారు. ప్రస్తుతం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడుతున్న భువీ.. 200 వికెట్ల మార్కును చేరుకోవడానికి కేవలం 2 వికెట్ల దూరంలోనే ఉన్నారు. ఇప్పటివరకు ఆడిన 190 మ్యాచ్‌ల్లో భువనేశ్వర్ 198 వికెట్లు పడగొట్టారు. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లోనే భువీ ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇద్దరు పర్పుల్ క్యాప్‌లు గెలిచిన ఏకైక భారతీయ బౌలర్‌గా భువీకి ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డు ఉంది.

ఇక రెండో వ్యక్తి కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) స్పిన్ మాంత్రికుడు సునీల్ నరైన్. నరైన్ 200 వికెట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టాలంటే మరో 8 వికెట్లు తీయాల్సి ఉంది. 189 మ్యాచ్‌లలో 192 వికెట్లు తీసిన నరైన్.. ఎకానమీ రేటు విషయంలో కూడా అందరికంటే ముందుంటారు. కేకేఆర్ జట్టులో కీలక బౌలర్‌గా ఉన్న నరైన్, ఈ సీజన్ మధ్యలోపు ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. 200 వికెట్లు తీసిన తొలి విదేశీ బౌలర్‌గా చరిత్ర సృష్టించేందుకు నరైన్ తహతహలాడుతున్నారు.

ముంబై ఇండియన్స్ గన్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ రేసులో ఉన్నారు. అయితే భువీ, నరైన్‌లతో పోలిస్తే బుమ్రా కొంచెం దూరంలో ఉన్నారు. బుమ్రా 200 వికెట్ల మార్కును తాకడానికి మరో 17 వికెట్లు కావాలి. ప్రస్తుతం ఆయన ఖాతాలో 145 మ్యాచ్‌లకు గానూ 183 వికెట్లు ఉన్నాయి. బుమ్రా ఉన్న ఫామ్ చూస్తుంటే ఒక సీజన్‌లో 17 వికెట్లు తీయడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు. ఈ ముగ్గురూ గనుక 200 వికెట్లు తీస్తే, ఐపీఎల్ చరిత్రలో చహల్ (221 వికెట్లు) తర్వాత ఈ ఘనత సాధించిన బౌలర్లుగా నిలిచిపోతారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us