AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎడారిలా మారిన కొల్లేరు.. ఆకలితో అలమటిస్తున్న విదేశీ పక్షులు

ఏలూరు : పచ్చని ప్రకృతికి, కలకలలాడే విదేశీ విహంగాలకు, వేలాది రకాల మత్స్య సంపదకు ఆవాసమై నిలిచిన ఆసియా ఖండపు అతిపెద్ద సహజసిద్ధ తీపి నీటి సరస్సు ‘కొల్లేరు’ ఎడారిని తలపిస్తుంది. తీవ్ర అస్తిత్వ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. వేసవి తీవ్రతకు తోడు ప్రతియేటా పూడిక పేరుకుపోవటం తో సరస్సు పరివాహక ప్రాంతాలు చుక్క నీరు కనిపించటం లేదు. నేర్రెలబారిన నేల పై చేపలు దొరక్క పోవటం తో తీవ్ర ఆహార కొరతను సైబీరియన్ పక్షులు ఎదుర్కుంటున్నాయి. కొల్లేరు సరస్సు గర్భం ప్రస్తుతం పూర్తిగా ఎండిపోయి, నెర్రెలు బారిన భూములతో దర్శనమిస్తోంది.

B Ravi Kumar
| Edited By: |

Updated on: May 26, 2026 | 10:10 AM

Share
ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన ఈ చిత్తడి నేలలు, ఇప్పుడు పక్షుల మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, పక్షులకు ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా, ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ఏటికేటికీ పడిపోతోందనే వాడన్ సైతం బలంగా వినిపిస్తుంది . మండవల్లి మండల పరిధిలోని పెద్దయడగాడి వంటి ప్రధాన ప్రాంతాల తో పాటు ఆటపాక పక్షుల కేంద్రంలో నో ఇదే దుస్థితి ఎర్పడటం ఆందోళన కలిగిస్తుంది.

1 / 5
  వర్షాలు , వరదల సమయంలో పెద్దఎత్తున సమీప పట్టణాలు, నగరాల నుండి వస్తున్న మురుగునీరు మరియు పారిశ్రామిక వ్యర్థాలు. ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే ఈ కలుషిత జలాలు నేరుగా కొల్లేరు సరస్సులోకి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు సరస్సు పరిధిలో వెలిసిన అనధికార రొయ్యల, చేపల చెరువుల్లో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు, పురుగుమందులు, కృత్రిమ మందుల వల్ల మిగిలి ఉన్న కొద్దిపాటి జలాలు కూడా పూర్తిగా విషతుల్యంగా మారుతున్నాయి. ఈ విషపూరిత నీటి ప్రభావంతో సరస్సులోని స్థానిక చేపల జీవవైవిధ్యం పూర్తిగా కనుమరుగవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

2 / 5
 వరద ప్రవాహానికి వీలుగా కాలువలు పునరుద్దరించ్కపోవటం తో మట్టిమేట వేసి నిరు నిలబదతంలేదని ఇది తమ జీవిన విధానం పై దెబ్బతీస్తుందని కొల్లేరు ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొల్లేరు పరిరక్షణ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) గతంలో పలుమార్లు కఠినమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ, ఆర్థిక బలంతో అక్రమార్కులు సరస్సు భూములను ఆక్రమించి ఆక్యు కల్చర్ చెరువులుగా మార్చేస్తున్నారు.

3 / 5
 వేసవి కాలంలో లభించే కొద్దిపాటి సహజ జలాలను సైతం ఈ ప్రైవేట్ చెరువులకే మళ్లించడంతో సరస్సు సహజ నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. ఈ విధమైన దోపిడీ వల్ల కొల్లేరు ఉనికికే ముప్పు వాటిల్లుతోంది.   కొల్లేరు కాలుష్యం కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా, సరస్సు చుట్టుపక్కల నివసించే పదుల సంఖ్యలోని గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ కలుషిత జలాలను వాడటం వల్ల స్థానికులు చర్మ వ్యాధులు, శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. పశువులు తాగేందుకు కూడా నీరు లభించని దుస్థితి నెలకొంది.

4 / 5
ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, అక్రమ ఆక్రమణలను తొలగించి, సరస్సులోకి మురుగునీరు చేరకుండా కట్టడి చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. సరస్సులో ఏడాది పొడవునా కనీస నీటి నిల్వ ఉండేలా శాస్త్రీయంగా రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని, తద్వారా ఈ అంతర్జాతీయ పర్యావరణ సంపదను కాపాడుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

5 / 5
Follow Us
లైట్ తీసుకోవద్దు.. చికెన్ లివర్, మటన్ లివర్ తినేముందు ఈ నిజాలు..

డీమార్ట్‌లో తెలివిగా షాపింగ్ చేయడం ఎలా..? ఈ చిట్కాలు పాటిస్తే..

పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు

కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు

మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్

చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..

దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో

తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్

చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?

చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..