AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లకు సర్కార్ శ్రీకారం!

పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అక్టోబర్ 4వ తేదీన కొత్తగా మరో 3 లక్షల ఇళ్లకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు.అలాగే తెనాలిలో 3డి కాంక్రీట్ ప్రింటింగ్ పైలట్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లకు సర్కార్ శ్రీకారం!
Cm Chandrababu, Union Min Launch 3 Lakh Homes And 3d Printing Pilot
Anand T
|

Updated on: Oct 03, 2026 | 7:24 PM

Share

అమరావతి, అక్టోబర్ 3: పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. మరింత మందికి లబ్ది కలిగేలా 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెంలో కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో కలిసి భూమిపూజ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 28 నెలల కాలంలో 5.50 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించింది.

గతేడాది నవంబరులో 3 లక్షల ఇళ్లకు.. ఈ ఏడాది మార్చిలో 2.50 లక్షల ఇళ్లకు రెండు విడతలుగా సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించింది. ఇవే కాకుండా వచ్చే మార్చి నాటికి మరో 4.20 లక్షల ఇళ్లను నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చేలా పనులు చేపడుతోంది. ఓ పక్కన రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం చేపడుతూనే.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన్-గ్రామీణ్ 2.0 పథకం కింద వీలైనన్ని ఇళ్లను కేటాయించేలా కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. దీంట్లో భాగంగా ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 3 లక్షల ఇళ్లను కేటాయించింది. దీంతో మరింత జాప్యం చేయకుండా ఆ 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేసి నిర్మాణ పనుల ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనుంది.

ఇళ్ల నిర్మాణానికి కొత్త టెక్నాలజీ

గృహనిర్మాణ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, CSIR-CBRI (రూర్కీ), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ చేపట్టేలా పైలెట్ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ పైలెట్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు.

దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెడుతున్న ఈ పైలట్ ప్రాజెక్టు కింద తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం, ఓబులనాయుడు పాలెం గ్రామాల్లో రూ.14 కోట్ల అంచనాతో 177 ఇళ్లను నిర్మించనున్నారు. అత్యంత వేగవంతమైన నిర్మాణం, శ్రమ, నిర్మాణ వ్యర్థాల తగ్గుదల, నాణ్యత, దృఢత్వంతో ఉండేలా ఈ అత్యాధునిక టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం ఉంటుంది.

సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు

సీఎం చంద్రబాబు ఉదయం 10.15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 10.35 గంటలకు తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామానికి చేరుకుంటారు. 10.40 గంటలకు 3డీ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశమవుతారు. 110.10 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. తెనాలి పర్యటన ముగించుకుని మధ్యాహ్నం 01.35 గంటలకు ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు
పేద ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. కొత్తగా మరో 3లక్షల ఇళ్లు
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
కట్ చేసిన నిమ్మకాయలను ఇలా స్టోర్ చేస్తే.. వారమైనా చెడిపోవు
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
మొదట్లో స్లో.. చివర్లో ఫుల్ స్పీడ్.. భారత్ గోల్డ్ బాక్స్ ఫుల్
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నా.. అందుకే ఇలా..
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
తెలంగాణ ఓటర్లకు ECI గుడ్‌న్యూస్! నోటీసుల గందరగోళం,స్పెషల్ డ్రైవ్
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చార్ట్ ప్రిపరేషన్ తర్వాత కూడా కన్ఫర్మ్ టికెట్ పొందొచ్చని తెలుసా?
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
చుండ్రు పదేపదే వస్తుందా? ఈ తప్పులే అసలు కారణం..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఆ హీరోకు చీరాల బీచ్‏లో రిసార్ట్.. ఇప్పుడు వందల కోట్ల ఆస్తి..
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!
ఈ ప్రాంతాల్లో రాబోయే 36 గంటల పాటు తాగునీటి సరఫరా బంద్!