Tarun : తరుణ్ కెరీర్‌ను మలుపు తిప్పాల్సిన సినిమా.. ఆ ఒక్క గొడవతో మధ్యలోనే ఆగిపోయిన క్రేజీ ప్రాజెక్ట్!
ఒకప్పుడు టాలీవుడ్ లవర్ బాయ్ అంటే ఠక్కున గుర్తొచ్చే పేర్లలో తరుణ్ ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత హీరోగా వరుస హిట్లతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడే అనుహ్యంగా సినిమాలకు దూరమయ్యాడు. అయితే తరుణ్ కెరీర్ లో ఆగిపోయిన ఓ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా.. ? సక్సెస్ ఫుల్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడితో మొదలైన ఆ మూవీ మధ్యలోనే నిలిచిపోయింది. అందుకు గల కారణాలు ఏంటో తెలుసుకుందామా.

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య దర్శకత్వంలో ఒకప్పటి లవర్ బాయ్ తరుణ్ నటించాల్సిన సినిమా చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి. భారీ అంచనాల మధ్య షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆదిత్య.. ఈ సినిమా నిర్మాణ సమయంలో, విడుదల సమయంలో ఎదుర్కొన్న కఠినమైన వాస్తవాలను వెల్లడించారు. 2013లో తరుణ్, విమలా రామన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రానికి సంబంధించిన కీలక అంశాలను ఆయన బయటపెట్టారు. బాస్ సినిమా తర్వాత తనకు కొంత గ్యాప్ వచ్చిందని, ఆ సమయంలో తాను లాస్ ఏంజిల్స్‌లో ఉన్నానని వి.ఎన్. ఆదిత్య వివరించారు. అప్పుడే రాజు, ప్రశాంతి అనే కుటుంబ స్నేహితులు సినిమాపై ఉన్న ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారని తెలిపారు. తరుణ్‌తో ఇది తనకు రెండవ సినిమా అని, అంతకుముందు ఓ చిత్రానికి దర్శకత్వం వహించినట్లు గుర్తు చేసుకున్నారు. తరుణ్ ఒక కూల్, యూత్ ఫుల్ హీరో అని, అప్పట్లో అతనికి మంచి మార్కెట్ ఉందని ఆదిత్య అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Balakrishna: బాలకృష్ణకు లవర్‌గా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..
అయితే, సినిమా నిర్మాణ దశలో ఊహించని సవాళ్లు ఎదురయ్యాయి. నిర్మాతల మధ్య కొన్ని విభేదాలు తలెత్తడంతో సినిమా ఆలస్యమైంది. ఒకరు పెట్టుబడి పెట్టిన తర్వాత, మరొకరు ముందుకు రావడం వంటి సమస్యలు తలెత్తాయి. చివరికి రాజు, ప్రశాంతి దంపతులు సినిమాను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని పూర్తి చేశారని ఆదిత్య వెల్లడించారు. సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం ఒక పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది. లాలూ దర్వాజా లష్కర్, ఓ ప్రేమ వంటి పాటలు అద్భుతమైన ప్రజాదరణ పొందాయని ఆదిత్య గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఓ ప్రేమ పాట కోసం తాము దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో ఒక భారీ సెట్ వేసినట్లు చెప్పారు. ఆ సెట్‌కు కూడా చాలా మంచి పేరు వచ్చిందని, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలిచాయని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..
పాటలు, నటీనటుల ప్రదర్శన బాగున్నప్పటికీ, సినిమా విడుదల సమయంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. సరైన థియేటర్లు లభించకపోవడం, అలాగే తగినంత పబ్లిసిటీ చేయలేకపోవడం సినిమాపై ప్రతికూల ప్రభావం చూపింది. దీనివల్ల సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయిందని వి.ఎన్. ఆదిత్య ఆవేదన వ్యక్తం చేశారు. “ఒక బిడ్డని కని, దానికి సరైన బట్టలు వేయలేకపోయినట్టు” అనిపించిందని, తాను ఎంతో ఇష్టపడి చేసిన సినిమాకు ఈ పరిస్థితి రావడం బాధించిందని అన్నారు. కొన్నిసార్లు అన్నీ మన చేతుల్లో ఉండవని ఆయన పేర్కొన్నారు. తరుణ్ కెరీర్ గురించి మాట్లాడుతూ, అతను ఒక నాచురల్ యాక్టర్ అని, నువ్వే కావాలి వంటి సినిమాతో స్టార్‌డమ్ సాధించాడని చెప్పారు. అయితే, మధ్యలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తను ఇంకా పెద్ద స్టార్ అయ్యే అవకాశం కోల్పోయాడని అభిప్రాయపడ్డారు. చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి సినిమా ద్వారా తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ప్రొడక్షన్, సరైన రిలీజ్ ప్లానింగ్ ఎంత ముఖ్యమో అని ఆదిత్య స్పష్టం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‌తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..
ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..
