AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొబ్బట్లు వేసిన మంత్రి సతీమణి.. నూజివీడులో కూటమి వినూత్న ప్రచారం!

బొబ్బట్లు వేసిన మంత్రి సతీమణి.. నూజివీడులో కూటమి వినూత్న ప్రచారం!

B Ravi Kumar
| Edited By: |

Updated on: Oct 24, 2026 | 4:26 PM

Share

నూజివీడు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఆయన సతీమణి కమలాలక్ష్మి, కుమారుడు నితిన్‌ కృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓ స్వీట్‌ షాపు వద్దకు వెళ్లారు. అక్కడ కమలాలక్ష్మి స్వయంగా పెనంపై బొబ్బట్లు వేయడంతో స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఓటర్లతో మమేకమయ్యేందుకు మంత్రి కుటుంబం చేసిన ఈ ప్రయత్నం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల ప్రచారంలో నేతల పాట్లు అన్నీ ఇన్నీ కావు! ఓట్ల కోసం ఓటర్లను ఆకట్టుకునేందుకు వినూత్న పంథాను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులు సైతం ఎన్నికల ప్రచార బరిలో దూకుడు పెంచారు. నూజివీడు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రిగారి సతీమణి స్వయంగా స్వీట్ షాపులో గరిటె పట్టి బొబ్బట్లు వేశారు. నూజివీడు మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రస్తుతం పీక్స్‌కు చేరింది. కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రచార పర్వంలో మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబం విస్తృతంగా పాల్గొంటోంది. ఇందులో భాగంగా మంత్రి పార్థసారథి భార్య కమలాలక్ష్మి, కుమారుడు నితిన్ కృష్ణ నూజివీడు పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా స్థానిక స్వీట్ దుకాణం వద్దకు చేరుకున్న కమలాలక్ష్మి, అక్కడ కూర్చొని పెనంపై వేడివేడిగా బొబ్బట్లు వేస్తూ కనిపించారు. ఆమె పక్కనే కుమారుడు నితిన్ కృష్ణ కూడా ఉన్నారు. మంత్రి సతీమణి సాధారణ మహిళలా ఒదిగిపోయి స్వయంగా బొబ్బట్లు తయారు చేయడం చూసి స్థానిక ప్రజలు, ఆసక్తిగా తిలకించారు. ఎన్నికల వేళ ప్రజలను ఆకర్షించేందుకు, ఓటర్లతో మమేకమయ్యేందుకు నేతలు చేస్తున్న ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ వైరల్ అవుతున్నాయి. నూజివీడు మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేయడమే లక్ష్యంగా మంత్రి కుటుంబం ముమ్మరంగా సాగిస్తున్న ఈ ప్రచారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు ఎలా పొందాలి?

గన్‌ లైసెన్సులు.. ఆత్మరక్షణ కోసమా? మూగజీవాల వేట కోసమా?

దంపతుల రీల్స్‌ పిచ్చి..కన్నబిడ్డ సముద్రంలో కొట్టుకుపోతున్నా

ఏనుగులకు స్పెషల్ డైట్.. మైసూర్ దసరా జంబూ సవారీ వెనుక అసలు రహస్యం ఇదే

రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్ ఇక..నెలనెలా మరో 6 సరుకులు! త్వరలోనే అధికారిక ప్రకటన.!

Follow Us