జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యువ రైతు ప్రవీణ్ తన ఎండిపోయిన వరి పొలంలో బైక్ నడుపుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎల్ నినో ప్రభావం కారణంగా ఏర్పడిన నీటి కొరత, విద్యుత్ సమస్యల కారణంగా మూడు ఎకరాల్లో సాగు చేసిన వరి పంట ఎండిపోవడంతో తన ఆవేదనను ఈ విధంగా వ్యక్తం చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.