బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. చిట్టి హిట్ కొట్టేది ఇంకెప్పుడో..
24 October 2026
Rajeev
టాలీవుడ్‌లో ‘జాతిరత్నాలు’ సినిమాతో చిట్టిగా ప్రేక్షకులకు దగ్గరైంది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.
తొలి సినిమాతో వచ్చిన క్రేజ్‌ను కొనసాగిస్తూ వరుస విజయాలు అందుకోవాలని ఫరియా భావించినా, ఆమెకు సోలో హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో అవకాశాలు, విజయాలు రాలేదు.
లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఫరియాకు, ఈ చిత్రాలు ‘జాతిరత్నాలు’ స్థాయి గుర్తింపును తీసుకురాలేకపోయాయి.
రవితేజ నటించిన ‘రావణాసుర’ సినిమాలో ఫరియా కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ సినిమా ఆమె కెరీర్‌కు పెద్ద బ్రేక్ ఇవ్వలేకపోయింది.
2024లో విడుదలైన ‘మత్తు వదలరా 2’ సినిమాలో ఫరియా నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా విజయంతో ఆమెకు మరోసారి మంచి గుర్తింపు లభించింది.
ఫరియా ఎక్కువగా కామెడీ ప్రధానమైన సినిమాల్లో కనిపించడం గమనార్హం. ఆమె నటనలోని వైవిధ్యాన్ని చూపించే బలమైన పాత్రలు మరిన్ని వస్తే కెరీర్‌కు ఉపయోగపడే అవకాశం ఉంది.
రీసెంట్ గా సందీప్ కిషన్ హీరోగా నటించిన సిగ్మా సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.