AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

100 రోగాలను తరిమికొట్టి.. శరీరాన్ని ఉక్కులా మార్చే మఖానా లడ్డు

ఇప్పుడు చెప్పుకోబోయే లడ్డులో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. ఇది ఆస్టియోపొరోసిస్ వంటి ఎముక సంబంధిత సమస్యలను నివారించడంలో హెల్ప్ చేస్తుంది.

Prasanna Yadla
|

Updated on: Oct 24, 2026 | 3:24 PM

Share
ఆరోగ్యకరమైన ఆహారంపై పెరుగుతున్న క్రమంలో రుచితో పాటు పోషక విలువలను అందించే సంప్రదాయ వంటకాలు ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నాయి. అటువంటి వాటిలో ఒకటి పూల్ మఖానా లడ్డూ. ఈ లడ్డూలు కేవలం నోరూరించే రుచిని మాత్రమే కాకుండా, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. లోటస్ సీడ్స్ లేదా తామర గింజలు అని పిలువబడే పూల్ మఖానా, అనేక ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటుంది.

1 / 5
పూల్ మఖానాలో ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. ఇది ఆస్టియోపొరోసిస్ వంటి ఎముక సంబంధిత సమస్యలను నివారించడంలో హెల్ప్ చేస్తుంది.  ఇందులో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. పూల్ మఖానా కొలెస్ట్రాల్ స్థాయిలను కరెక్ట్ చేసి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీనిలోని పోషకాలు నరాల పనితీరును మెరుగుపరచి, మెదడు ఆరోగ్యానికి దోహదపడతాయి. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రోటీన్లు, ఇతర పోషకాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

2 / 5
ముందుగా, ఐదు కప్పుల పూల్ మఖానాను తక్కువ మంటపై మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు క్రిస్పీగా మారే వరకు వేయించాలి.
అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, ఒక కప్పు బాదం పప్పులు, ఒక కప్పు జీడిపప్పులను గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి.
 అదే కప్పుతో ఒక కప్పు డెసికేటెడ్ కొబ్బరిపొడిని కూడా లైట్‌గా వేయించాలి. డెసికేటెడ్ కొబ్బరిపొడి లేకపోతే, ఎండుకొబ్బరి తురుము లేదా చిన్న ముక్కలను వాడుకోవచ్చు. వేయించిన పూల్ మఖానాను మిక్సీలో వేసి మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి. మంచి సువాసన కోసం ఆరు ఏడు యాలకులను కూడా కలుపుకోవచ్చు.

ముందుగా, ఐదు కప్పుల పూల్ మఖానాను తక్కువ మంటపై మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు క్రిస్పీగా మారే వరకు వేయించాలి. అదే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, ఒక కప్పు బాదం పప్పులు, ఒక కప్పు జీడిపప్పులను గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించుకోవాలి. అదే కప్పుతో ఒక కప్పు డెసికేటెడ్ కొబ్బరిపొడిని కూడా లైట్‌గా వేయించాలి. డెసికేటెడ్ కొబ్బరిపొడి లేకపోతే, ఎండుకొబ్బరి తురుము లేదా చిన్న ముక్కలను వాడుకోవచ్చు. వేయించిన పూల్ మఖానాను మిక్సీలో వేసి మెత్తటి పౌడర్‌లా చేసుకోవాలి. మంచి సువాసన కోసం ఆరు ఏడు యాలకులను కూడా కలుపుకోవచ్చు.

3 / 5
వేయించిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరిపొడిని కూడా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం పిండి మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. వేరొక పాన్‌లో ఒకటిన్నర కప్పు బెల్లం, అర కప్పు నీళ్లు పోసి, బెల్లం పూర్తిగా కరిగి, కొద్దిగా ముదురు తీగ పాకం వచ్చేవరకు మరిగించాలి. ఈ పాకాన్ని చల్లారిన తర్వాత పిండి మిశ్రమంలో పోసి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కలిపి బాగా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి అదనంగా వేయించిన డ్రై ఫ్రూట్స్ కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి.

4 / 5
ఈ లడ్డూలు గాలి చొరబడని డబ్బాలో ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి. రోజుకు ఒక లడ్డూ చొప్పున పిల్లలు, పెద్దలు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇవి చాలా మంచిది. మీరు ఈ కొలతలతో సుమారు 20 కి పైగా లడ్డూలు తయారుచేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి పూల్ మఖానా లడ్డూలు మంచి ఫుడ్ అని చెప్పొచ్చు.

5 / 5
Follow Us