ఓడిన చోటే గెలిచి చూపించా.. నా జీవితంలో అదే అసలైన విజయం.. సాయి పల్లవి

Rajitha Chanti

Pic credit - Instagram

23 October 2026

టాలీవుడ్, కోలీవుడ్‌లో తనదైన సహజ నటనతో, ఎలాంటి గ్లామర్ హంగులు లేకుండా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.

మలయాళంలో 'ప్రేమమ్' సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈ బ్యూటీ, ఆ తర్వాత 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచారు.

ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ 'రామాయణ' చిత్రంలో సీత పాత్రలో నటిస్తూ బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నారు.

తాజాగా ప్రముఖ నటుడు జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2' టాక్ షోకి తొలి అతిరథ అతిథిగా హాజరైంది.

"మీ జీవితంలో జయమ్ము నిశ్చయమ్మురా అనిపించిన సంఘటన ఏది?" అనే ప్రశ్నకు ఆమె తన డాన్స్ కెరీర్‌లోని ఒక భావోద్వేగ సంఘటనను గుర్తు చేసుకున్నారు.

తన కెరీర్ ప్రారంభ దశలో తాను ఓడిపోయిన, నిరాశ చెందిన అదే స్టేజ్‌పై.. ప్రభుదేవా కొరియోగ్రఫీ చేసిన 'రౌడీ బేబీ' పాటకు గుర్తింపు తెచ్చుకున్నానని తెలిపారు.

తాను ఒకప్పుడు ఓడిపోయిన వేదికపైనే తనను తాను విజయవంతంగా నిరూపించుకోవడం తన జీవితంలోనే అత్యంత గొప్ప విజయంగా భావిస్తానని పేర్కొన్నారు.

తన ముఖంపై ఉండే పింపుల్స్ గురించి, గతంలో తన వాయిస్ గంభీరంగా ఉండటం వల్ల ఫోన్లలో మాట్లాడినప్పుడు చాలామంది 'సార్' అని పిలిచేవారని నవ్వుతూ చెప్పారు.