AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఎప్పుడూ శ్రీహరి పక్కనే ఉండేవాణ్ణి.. కానీ చనిపోయినప్పుడు లేను.. ఆయన ఉంటే బాగుండేది.. టాలీవుడ్ నటుడు ఎమోషనల్..

తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేశారు శ్రీహారి. విలన్, హీరోగా, నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మప్పించిన ఆయన అకాల మరణం ఇండస్ట్రీకి తీరని లోటు. ఇప్పటికీ ఆయన జ్ఞాపకాలను పంచుకుంటూ ఎంతోమంది నటీనటులు భావోద్వేగానికి గురయ్యారు. తాజాగా టాలీవుడ్ నటుడు శ్రీహారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

Tollywood : ఎప్పుడూ శ్రీహరి పక్కనే ఉండేవాణ్ణి.. కానీ చనిపోయినప్పుడు లేను.. ఆయన ఉంటే బాగుండేది.. టాలీవుడ్ నటుడు ఎమోషనల్..
Srihari
Rajitha Chanti
|

Updated on: Oct 24, 2026 | 4:20 PM

Share

టాలీవుడ్ నటుడు లక్ష్మణ్ మీసాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడిప్పుడే తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో విలక్షమైన పాత్రలు తనదైన ముద్ర వేసారు. తాజాగా ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణంలో ఎదురైన ఇద్దరు ముఖ్య వ్యక్తులు – దివంగత నటుడు శ్రీహరి, దర్శకుడు అజయ్ భూపతి – గురించి లోతైన విషయాలను పంచుకున్నారు. శ్రీహరితో తనకున్న అనుబంధం, ఆయన గొప్ప మనసు, అలాగే అజయ్ భూపతి తన కెరీర్‌కు ఇచ్చిన ప్రోత్సాహం గురించి లక్ష్మణ్ భావోద్వేగంగా మాట్లాడారు. శ్రీహరి గురించి లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆయన ఉంటే షూటింగ్ సెట్‌లో ఒక క్రమశిక్షణ ఉండేదని పేర్కొన్నారు. శ్రీహరి వ్యక్తిత్వం తరచుగా మారుతూ ఉండేదని, కొన్నిసార్లు గందరగోళంగా ఉన్నా, కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండేవారని తెలిపారు.ఈ ఇంటర్వ్యూలో నటుడు శ్రీహరిని గుర్తు చేసుకుంటూ లక్ష్మణ్ మీసాల భావోద్వేగానికి గురయ్యారు. శ్రీహరి సెట్స్‌లో ఎంత డిసిప్లిన్‌గా ఉండేవారో చెబుతూనే, తనని ఎంతో ఆప్యాయంగా ‘చిట్టి’ అని పిలిచేవారని తెలిపారు. ఒకానొక సమయంలో శ్రీహరి తనను ఇంటికి ఆహ్వానించారని, ఆయన సతీమణి శాంతి గారు స్వయంగా కాఫీ ఇచ్చి ఆత్మీయంగా పలకరించారని గుర్తుచేసుకున్నారు. శ్రీహరి ఎవరికైనా సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారని, ఆయన మరణ వార్త తెలిసినప్పుడు తాను రైలులో ప్రయాణిస్తున్నానని, ఆ క్షణంలో గుండె తరుక్కుపోయిందని ఆయన ఎమోషనల్ అయ్యారు. ఎప్పుడూ ఆయన పక్కనే ఉండే తాను.. చనిపోయినప్పుడు మాత్రం లేనని భావోద్వేగానికి గురయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

శ్రీహరి తర్వాత తన కెరీర్‌లో మరో కీలక వ్యక్తి అజయ్ భూపతి అని లక్ష్మణ్ మీసాల అన్నారు. వంగవీటి సినిమా షూటింగ్ సమయంలో అజయ్ భూపతి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని, తన పద్యపఠనాన్ని విన్న అజయ్ భూపతి ఆకట్టుకున్నారని తెలిపారు. పద్యాలు చదివే తన సామర్థ్యాన్ని చూసిన అజయ్, “ఇక నువ్వు పద్యాలు ఇంకెక్కడా వాడకు, మన సినిమాలో వాడతాను” అని చెప్పారని లక్ష్మణ్ గుర్తుచేసుకున్నారు. అలా RX100 చిత్రంలో మొదట విలన్ పాత్రకు ఎంపికైనప్పటికీ, కొన్ని చర్చల తర్వాత కమెడియన్ పాత్రకు మారినట్లు తెలిపారు. అయినప్పటికీ, అజయ్ భూపతి తన పాత్రకు పద్యాలను కొనసాగించాలని దృఢంగా పట్టుబట్టారని, “నా లక్ష్మణ్ పాడతాడండి అంతే” అని ఆయన చెప్పారని లక్ష్మణ్ వివరించారు.

ఈ పద్యాలే RX100 చిత్రంలో ఆయన పాత్రకు విశేష గుర్తింపు తెచ్చాయి. అజయ్ భూపతితో తన అనుబంధం మహాసముద్రం, శ్రీనివాస మంగాపురం వంటి తర్వాతి చిత్రాలలో కూడా కొనసాగిందని, ఆయన తన ప్రతిభను నమ్మి అవకాశాలు ఇస్తూనే ఉన్నారని లక్ష్మణ్ మీసాల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : ముఠా మేస్త్రీ షూటింగ్ 3 నెలలు ఆగిపోయింది.. అప్పుడు చిరంజీవి చెప్పిన మాటకు ఆశ్చర్యపోయా.. బాబూ మోహన్..

లక్ష్మణ్ మీసాల..

ఎక్కువ మంది చదివినవి : Cinema : గరివిడి లక్ష్మి పాత్రను మిస్ చేసుకున్న మరో హీరోయిన్.. నిత్యా మీనన్‏తోపాటు ఆ క్రేజీ బ్యూటీ కూడా..

Follow Us