AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రామాయణలో ఆ స్టార్ హీరోయిన్‌కు షాక్..! ఆమె పాత్రను ఎడిటింగ్‌లో లేపేశారా.?

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భారతీయ ఇతిహాసం ఆధారంగా రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది

రామాయణలో ఆ స్టార్ హీరోయిన్‌కు షాక్..! ఆమె పాత్రను ఎడిటింగ్‌లో లేపేశారా.?
Ramayana
Rajeev Rayala
|

Updated on: Oct 24, 2026 | 1:37 PM

Share

బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం రామాయణ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ చిత్రంలో మండోదరి పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరిగిన టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ విషయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. రావణాసురుడి భార్య మండోదరిగా కాజల్ నటించనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీంతో ఈ పాత్రలో ఆమె ఎలా కనిపించబోతుందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. కానీ తాజాగా విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో కాజల్ కనిపించకపోవడం అనేక అనుమానాలు మొదలయ్యాయి. రామాయణకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో ఇతర నటీనటుల ప్రస్తావన వస్తున్నప్పటికీ, కాజల్ పేరు మాత్రం పెద్దగా వినిపించడం లేదనే చర్చ సాగుతోంది. దీంతో ఆమె ఈ సినిమాలో నిజంగానే నటిస్తున్నారా.? ఒకవేళ నటిస్తే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలను ఎందుకు వెల్లడించడం లేదు.? అనే ప్రశ్నలు అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా, కాజల్‌కు సంబంధించిన సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు అనే ఊహాగానాలు కూడా తెరపైకి వచ్చాయి. రామాయణ గాథలో మండోదరి పాత్రకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కథను ఏ విధంగా తెరకెక్కిస్తున్నారు, ఏయే ఘట్టాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అనే అంశాలపై పాత్రల నిడివి ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తొలి భాగంలో మండోదరి పాత్ర పరిమితంగా ఉండవచ్చని, రెండో భాగంలో ఆమెకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇదే నిజమైతే, తొలి భాగానికి సంబంధించిన ప్రమోషన్లలో కాజల్ కనిపించకపోవడానికి కథలోని ఆమె పాత్ర నిడివి ఒక కారణం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు ‘రామాయణ’పై అంచనాలు పెరుగుతుండగా, మరోవైపు కాజల్ అగర్వాల్ పాత్రపై నెలకొన్న సందేహాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆమె సన్నివేశాలు సినిమాలో ఉన్నాయా.? మండోదరిగా ఆమె తొలి భాగంలో కనిపిస్తారా.? లేక రెండో భాగంలోనే ఆమె పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందా.? అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us