AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electricity Saving Tips: కరెంట్ బిల్లు పెరుగుతోందా..? ఫ్రిజ్‌ కారణం కావచ్చు..

Home Electricity Saving Tips: ఫ్రిజ్ బాగానే పనిచేస్తున్నా కరెంట్ బిల్లు మాత్రం ఎక్కువగా వస్తోందా? అయితే కొన్ని విషయాలను తప్పనిసరిగా గమనించాలి. కూలింగ్‌లో ఎలాంటి సమస్య కనిపించకపోయినా, ఫ్రిజ్‌లోని కొన్ని లోపాలు విద్యుత్ వినియోగాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అసలు ఫ్రిజ్ ఎక్కువ కరెంట్ తీసుకుంటోందని తెలిపే సంకేతాలు ఏమిటి? బిల్లు తగ్గించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Electricity Saving Tips: కరెంట్ బిల్లు పెరుగుతోందా..? ఫ్రిజ్‌ కారణం కావచ్చు..
Fridge Electricity Saving Tips
Janardhan Veluru
|

Updated on: Oct 24, 2026 | 3:41 PM

Share

Fridge Electricity Saving Tips: ఇంట్లో ఫ్రిజ్ సరిగ్గా పనిచేస్తున్నా విద్యుత్ బిల్లు మాత్రం పెరుగుతోందా? ఫ్రిజ్ చల్లగా ఉండటంతో ఎలాంటి సమస్య లేదని చాలామంది భావిస్తారు. కానీ కొన్ని సందర్భాల్లో కూలింగ్ బాగానే ఉన్నప్పటికీ ఫ్రిజ్ ఎక్కువ విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంది. దీనికి ఫ్రిడ్జ్‌ని వాడే విధానంలో పొరపాట్లు, నిర్వహణ లోపాలు లేదా సాంకేతిక సమస్యలు కారణం కావచ్చు. ఫ్రిజ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

కంప్రెసర్ ఆగకుండా పనిచేస్తోందా?

ఫ్రిజ్‌లోని కంప్రెసర్ అవసరాన్ని బట్టి ఆన్, ఆఫ్ అవుతూ లోపల ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. అయితే సాధారణ పరిస్థితుల్లోనూ అది ఎక్కువసేపు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంటే దీన్ని పరిశీలించాలి. వేడి వాతావరణం లేదా ఎక్కువ ఆహార పదార్థాలను తాజాగా ఉంచాల్సిన సందర్భాల్లో ఇలా కంప్రెసర్ నాన్‌స్టాప్‌గా పనిచేయడం జరగడం సాధారణమే. కానీ తరచుగా ఇదే పరిస్థితి ఉంటే సాంకేతిక నిపుణుడితో చెక్ చేయించుకోవడం మంచిది.

డోర్ రబ్బరు సరిగ్గా ఉందా?

ఫ్రిజ్ తలుపు చుట్టూ ఉండే రబ్బరు సీల్ దెబ్బతిన్నా, వదులుగా ఉన్నా చల్లని గాలి బయటకు వెళ్లి.. వేడి గాలి లోపలికి చేరే అవకాశం ఉంటుంది. దీంతో ఫ్రిజ్ అవసరమైన చల్లదనాన్ని కొనసాగించడానికి ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. తద్వారా విద్యుత్ బిల్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఫ్రిజ్ వెనుక దుమ్ము పేరుకుపోయిందా?

ఫ్రిజ్ వెనుక లేదా కింద ఉండే కండెన్సర్ కాయిల్స్‌పై దుమ్ము పేరుకుంటే వేడిని బయటకు పంపే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ దుమ్ముదూళి క్లీన్ చేసే ముందు తప్పనిసరిగా ప్లగ్‌ను తీసివేయాలి.

టెంపరేచర్ సెట్టింగ్ మరీ తక్కువగా ఉందా?

అవసరానికి మించి తక్కువ ఉష్ణోగ్రతను సెట్ చేస్తే కంప్రెసర్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. ఇది కూడా విద్యుత్ వినియోగం పెరిగేందుకు కారణమవుతుంది. ఫ్రిడ్జ్‌లో ఆహార పదార్థాల నిల్వ అవసరాలకు అనుగుణంగా ఉష్ణోగ్రతను సెట్ చేయడం మంచిది.

ఫ్రిజ్‌ను ఎక్కడ ఉంచుతున్నారు?

గ్యాస్ స్టవ్, ఓవెన్ లేదా నేరుగా ఎండ తగిలే ప్రదేశానికి దగ్గరగా ఫ్రిజ్‌ను ఉంచితే వేడిని బయటకు పంపడానికి ఫ్రిడ్జ్ ఎక్కువసేపు పనిచేయాల్సి వస్తుంది. గాలి సరిగ్గా ప్రసరించేలా చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చూసుకోవాలి.

విద్యుత్ బిల్లు తగ్గించుకోవాలంటే..

ఫ్రిజ్ తలుపును అవసరమైనప్పుడే తెరవాలి. ఫ్రిజ్‌ని పదేపదే ఓపన్ చేయడం సరికాదు. వేడి ఆహారాన్ని వెంటనే లోపల పెట్టకుండా కొంత చల్లారిన తర్వాత ఉంచాలి. లోపల గాలి ప్రసరణకు అడ్డంకులు కలిగేలా వస్తువులను కుక్కేయడం సరికాదు. విద్యుత్ బిల్లు అకస్మాత్తుగా పెరగడం, కంప్రెసర్ నిరంతరం పనిచేయడం వంటి సమస్యలు కొనసాగితే నిపుణుడితో టెస్ట్ చేయించాలి. సరైన నిర్వహణతో అనవసర విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు.

Follow Us