AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే..?

ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 (Asia Cup Rising Stars 2026) పూర్తి షెడ్యూల్ విడుదలైంది. నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లో జరిగే ఈ 50 ఓవర్ల టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. భారత్-ఎ, పాకిస్థాన్-ఎ జట్లు ఒకే గ్రూప్‌లో ఉండటంతో నవంబర్ 22న ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ పోరు ఎప్పుడంటే..?
Asia Cup Rising Stars 2026
Venkata Chari
|

Updated on: Oct 24, 2026 | 4:49 PM

Share

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) మెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించింది. రెండో ఎడిషన్‌గా జరగనున్న ఈ టోర్నీకి ఖతార్ ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు దోహాలోని రెండు వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

గత ఏడాది జరిగిన తొలి ఎడిషన్‌లో పాకిస్థాన్-ఎ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఈసారి పాకిస్థాన్-ఎ (Pakistan A) డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

ఈసారి టోర్నీని 50 ఓవర్ల ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. గత ఎడిషన్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. మొత్తం 8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్-ఏ: శ్రీలంక-ఎ, బంగ్లాదేశ్-ఎ, ఆఫ్ఘనిస్థాన్-ఎ, హాంకాంగ్

గ్రూప్-బీ: భారత్-ఎ, పాకిస్థాన్-ఎ, నేపాల్, యూఏఈ

లీగ్ దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లోని మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మొత్తం 12 లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

నవంబర్ 22న భారత్-పాకిస్థాన్ మ్యాచ్..

టోర్నీలో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్-ఎ vs పాకిస్థాన్-ఎ (India A vs Pakistan A). నవంబర్ 22న మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. దోహాలోని వెస్ట్ ఎండ్ పార్క్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.

భారత్-ఎ తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 20న నేపాల్‌తో తలపడుతుంది. నవంబర్ 24న యూఏఈతో లీగ్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది.

పూర్తి షెడ్యూల్..

తేదీ మ్యాచ్ సమయం (IST)
నవంబర్ 19 బంగ్లాదేశ్-ఎ vs హాంకాంగ్ 11:30 AM
నవంబర్ 19 శ్రీలంక-ఎ vs ఆఫ్ఘనిస్థాన్-ఎ 3:30 PM
నవంబర్ 20 పాకిస్థాన్-ఎ vs యూఏఈ 11:30 AM
నవంబర్ 20 భారత్-ఎ vs నేపాల్ 3:30 PM
నవంబర్ 21 శ్రీలంక-ఎ vs హాంకాంగ్ 11:30 AM
నవంబర్ 21 బంగ్లాదేశ్-ఎ vs ఆఫ్ఘనిస్థాన్-ఎ 3:30 PM
నవంబర్ 22 యూఏఈ vs నేపాల్ 11:30 AM
నవంబర్ 22 భారత్-ఎ vs పాకిస్థాన్-ఎ 3:30 PM
నవంబర్ 23 ఆఫ్ఘనిస్థాన్-ఎ vs హాంకాంగ్ 11:30 AM
నవంబర్ 23 శ్రీలంక-ఎ vs బంగ్లాదేశ్-ఎ 3:30 PM
నవంబర్ 24 భారత్-ఎ vs యూఏఈ 11:30 AM
నవంబర్ 24 పాకిస్థాన్-ఎ vs నేపాల్ 3:30 PM
నవంబర్ 26 సెమీఫైనల్: A1 vs B2 3:30 PM
నవంబర్ 27 సెమీఫైనల్: B1 vs A2 3:30 PM
నవంబర్ 29 ఫైనల్ 3:30 PM

లీగ్ దశ నవంబర్ 24తో ముగియనుంది. తొలి సెమీఫైనల్ నవంబర్ 26న, రెండో సెమీఫైనల్ నవంబర్ 27న జరగనుంది. ఫైనల్ నవంబర్ 29న వెస్ట్ ఎండ్ పార్క్‌లో నిర్వహిస్తారు.

భారత్-పాక్ పోరుపైనే అందరి చూపు

గ్రూప్-బీలో భారత్-ఎ, పాకిస్థాన్-ఎ ఒకే గ్రూప్‌లో ఉండటంతో నవంబర్ 22 మ్యాచ్ టోర్నీకి ప్రత్యేక ఆకర్షణగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్-ఎతో భారత్-ఎ పోటీ ఎలా ఉంటుందో ఆసక్తి నెలకొంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నేల కింద 2 మీటర్ల సొరంగం తవ్వే వింత పక్షి?!
నేల కింద 2 మీటర్ల సొరంగం తవ్వే వింత పక్షి?!
ఏందయ్యా ఇది ??? సముద్రం నుంచి ఒడ్డుకు వేలాది చేపలు.. వీడియో వైరల్
ఏందయ్యా ఇది ??? సముద్రం నుంచి ఒడ్డుకు వేలాది చేపలు.. వీడియో వైరల్
తక్షణ శక్తితో పాటు ఎముకలకు బాలన్ని ఇచ్చే లడ్డూ..రోజూ ఒక్కటి తింటే
తక్షణ శక్తితో పాటు ఎముకలకు బాలన్ని ఇచ్చే లడ్డూ..రోజూ ఒక్కటి తింటే
3 సార్లు చెత్త పెళ్లిళ్లు చేసుకున్నా.. 44 ఏళ్ల వయసులో ఒంటరిగా..
3 సార్లు చెత్త పెళ్లిళ్లు చేసుకున్నా.. 44 ఏళ్ల వయసులో ఒంటరిగా..
పెట్రోల్, డీజిల్‌పై కొత్త ట్యాక్సులు.. కేంద్రం బిగ్ అప్డేట్..
పెట్రోల్, డీజిల్‌పై కొత్త ట్యాక్సులు.. కేంద్రం బిగ్ అప్డేట్..
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..
ఐపీఎల్‌కు ధోనీ గుడ్ బై.. ఇకపై కొత్త అవతారంలో తల..
మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం..
మీకు గోళ్లు కొరికే అలవాటు ఉందా.. మీ మనసు చెప్పే రహస్యం..
ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి.. ప్రతీ రోజూ బోలెడెంత డబ్బులు
ఈ వ్యాపారం స్టార్ట్ చేయండి.. ప్రతీ రోజూ బోలెడెంత డబ్బులు
డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు.. కట్‌చేస్తే ఫామ్‌హౌస్‌లో జల్సాలు..
డ్యూటీలో ఉన్నట్టు రికార్డులు.. కట్‌చేస్తే ఫామ్‌హౌస్‌లో జల్సాలు..
తెలంగాణపై అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే వర్షాలు
తెలంగాణపై అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. వర్షాలే వర్షాలు