ఏకాంతంగా ముగ్గురం కలిసి ఎంజాయ్ చేద్దాం.. అంటూ భర్తను తీసుకెళ్లింది.. ఆ తర్వాత కాసేపటికే..
ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులోని కుప్పం సమీప అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి హత్యకు గురైన ఘటన కలకలం రేపింది. తిరుపత్తూరుకు చెందిన శశి కుమార్ హత్య కేసులో ఆయన భార్య లక్ష్మి, ప్రభుదేవాలను పోలీసులు అరెస్టు చేశారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేపట్టగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.

చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన దారుణ ఘటన ఏపీ – తమిళనాడు సరిహద్దులోని కంగుందిలో కలకలం రేపింది. తమిళనాడు.. తిరుపత్తూర్ కు చెందిన శశి కుమార్‌ను భార్య లక్ష్మి ఆమె ప్రియుడు ప్రభుతో కలిసి హత్య చేయించి.. అడవిలో పాతిపెట్టింది. వివాహేతర సంబంధమే కారణమని అనుమానించిన పోలీసులు.. ఆ దిశగా తమదైన స్టైల్ లో ఎంక్వైరీ చేయగా.. అసలు బండారం బయటపడింది. ప్రియుడిపై మోజుతో ఇల్లాలే.. ఈ హత్యకు ప్లాన్ రచించినట్లు తేలింది. వివరాల్లోకి వెళితే.. కుప్పం పీఎస్ పరిధిలోని పెద్దవంక అటవీ ప్రాంతంలో లభ్యమైన గుర్తు తెలియని శవం పోలీసులకు లభ్యమైంది. ఈనెల ఒకటో తేదీన అడవిలో పాతిపెట్టిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలను సేకరించారు. డెడ్ బాడీ తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా కరుంబూర్‌కు చెందిన శశి కుమార్‌ది గా గుర్తించారు.
ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు శశి కుమార్‌ను హత్య చేసింది.. అతని భార్య లక్ష్మి ఆమె ప్రియుడు ప్రభుదేవగా గుర్తించారు. కుప్పం మండలం కంగుందికి చెందిన ప్రభుదేవాతో శశి కుమార్ భార్య లక్ష్మికి ఏర్పడ్డ సన్నిహిత సంబంధమే హత్యకు కారణమని తేల్చిన పోలీసులు ఈ మేరకు కీలక ఆధారాలు స్వీకరించారు. గత రెండేళ్లుగా లక్ష్మీ ప్రభుదేవాల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే రెండుసార్లు లక్ష్మి కనిపించకుండా పోయింది. ఈ మేరకు లక్ష్మి మిస్సింగ్ పై తమిళనాడులో కేసు కూడా నమోదు కాగా ఆ తర్వాత లక్ష్మి ప్రభుదేవాతో ఉన్నట్లు తెలిసింది. ఇలా రెండుసార్లు లక్ష్మీ ఆచూకీని శశి కుమార్ గుర్తించాడు. దీంతో ప్రియుడు ప్రభుదేవాను కలుసుకోవడం లక్ష్మికి ఇబ్బందిగా మారింది.
ఇక ప్రియుడు ప్రభును మర్చిపోలేకపోయినా లక్ష్మి పక్కా ప్లాన్ వేసింది. గత నెల 29న భర్త శశి కుమార్ ను నమ్మించి బైక్ పై తిరుపత్తూరుకు వచ్చిన లక్ష్మి.. ప్రభుదేవాతో మీట్ అయింది. ఇలా ముగ్గురు కలిసి ఎంజాయ్ చేద్దామంటూ పెద్ద వంక అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. గుండాల మడుగు వంక ప్రాంతానికి చేరుకున్నాక పథకం ప్రకారం శశి కుమార్‌ను హతమార్చేందుకు ప్రయత్నించారు.
ప్రియుడు ప్రభుదేవాతో కలిసి ప్లాన్ అమలు తీసిన లక్ష్మి భర్తను బీర్ బాటిల్ తో దాడి చేసి ఆపై బండరాయితో తలపై మోది హత్య చేసింది. అనంతరం కుప్పంకు వచ్చి వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా అక్కడే గుంత తీసి పాతిపెట్టారు.. ఇలా లక్ష్మీ ప్రభుదేవాలు ఇక ఎవరు కనిపెట్టలేరని భావించారు. అడవిలో శవాన్ని పూడ్చిపెట్టి సాక్ష్యాధారాలను మాయం చేశామనుకున్నారు.
అయితే, పోలీసులకు అందిన సమాచారం అసలు నిజాన్ని బయటపెట్టేలా చేసింది. శశికుమార్ భార్య లక్ష్మిని అనుమానంతో అరెస్టు చేయడంతో శశికుమార్ మర్డర్ ప్లాన్ ఎలా సక్సెస్ చేశారో పోలీసులకు తెలిసిపోయింది. ఈ మేరకు శశి కుమార్ భార్య లక్ష్మి, ఆమె ప్రియుడు ప్రభుదేవాలను అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరినీ.. రిమాండ్‌కు తరలించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
