AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఆ రోజే..!

ఏపీలోని రైతులకు త్వరలో ప్రభుత్వం శుభవార్త అందించనుంది. అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు అయినట్లు సమాచారం. దీంతో రైతులు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు అందుతాయంటే..?

Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు లైన్ క్లియర్.. అకౌంట్లోకి ఆ రోజే..!
Annadata Sukhibhava
Venkatrao Lella
|

Updated on: Oct 24, 2026 | 9:00 AM

Share

ఏపీలోని రైతులకు త్వరగా శుభవార్త అందనుంది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకాల ద్వారా రెండో విడత నిధులు త్వరలో విడుదలయ్యే అకకాశముంది. అక్టోబర్ 30వ తేదీన పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే అవకాశముండగా.. అన్నదాత సుఖీభవ నిధులు కూడా అదే రోజు రిలీజ్ అయ్యే చాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 లక్షల మందికి పైగా రైతులు ఈ నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 17న ఈ నిధులు విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుతం దీపావళికి ముందే అక్టోబర్ 30వ తేదీన ఈ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.  అన్నదాత సుఖీభవ కింద రూ.4 వేలు జమ కానుండగా.. పీఎం కిసాన్ కింద రూ.2 వేలు కలిపి ఏపీ రైతుల ఖాతాల్లో ఒకేసారి రూ.6 వేలు జమ అవుతాయి.

ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్‌కు తొలి విడత డబ్బులను జూన్ 20వ తేదీన రిలీజ్ చేశారు. ఇప్పుడు రెండో విడత నిధులను విడుదల చేయడానికి రంగం సిద్దమవుతోంది. ఈ పథకం కేవలం భూమి ఉన్న రైతులకు మాత్రమే కాకుండా.. భూమి లేని కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది. కౌలు రైతులురైతు భరోసా కేంద్రాలలో సీసీఆర్‌సీ (క్రాప్ కల్టివేషన్ రైట్స్ కార్డ్) తీసుకోవాల్సి ఉంటుంది. సీసీఆర్‌సీ కార్డు ఉన్న కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందవచ్చు.. ఈ కార్డు లేని రైతులకు డబ్బులు అందే అవకాశం లేదు. కౌలు రైతులు తమ భూ యజమానితో మాట్లాడి సీసీఆర్‌సీ కార్డును పొందాలని ప్రభుత్వం సూచిస్తోంది.

అన్నదాత సుఖీభవ స్టేటస్ తెలుసుకోవడం ఎలా..?

–“అన్నదాత సుఖీభవ” అని వెబ్ సైట్ ఓపెన్ చేయండి

-“నో యువర్ స్టేటస్” అనే ఆప్షన్ ఎంచుకోండి

-ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు

పీఎం కిసాన్ స్టేటస్ తెలుసుకోండిలా..?

–పీఎం కిసాన్ వెబ్ సైట్ https://pmkisan.gov.in/ తెరవండి

-“నో యువర్ స్టేటస్” అనే ఆప్షన్ ఎంచుకోండి

-రిజిస్ట్రేషన్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి

-ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి

-అనంతరం మీ స్టేటస్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి

ఇవి అప్డేట్ చేసుకోండి..

నిధులు సజావుగా ఖాతాల్లో జమ కావడానికి రైతులు కొన్ని ముఖ్యమైన అప్‌డేట్‌లను చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మీ బ్యాంక్ ఖాతాకు NPCI లింక్ చేయబడిందా లేదా తనిఖీ చేసుకోవాలి. అలాగే ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్, eKYC పూర్తి అయ్యాయో లేదో నిర్ధారించుకోవాలి. ఈ అప్‌డేట్‌లన్నీ చేసుకున్న రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అవుతాయి.

Follow Us