AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dosa Batter: దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా సరిచేయండి

దోశ.. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే బ్రేక్‌ ఫాస్ట్.. దీన్ని ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు. అయితే కొన్ని సార్లు దోశల కోసం పిండి కలిపేటప్పుడూ పొరపాటు నీరు ఎక్కువగా పడి.. అది దోశలు వేయడానికి పనికిరాకుండా.. పలచగా మారిపోతుంది. దీంతో ఆ పిండిని ఏం చేయాలో చాలా మందికి అర్థం కాదు. కానీ ఇంట్లోనే దొరికే కొన్ని వస్తువులు కలిపి.. ఆ పిండితోనే మంచి క్రిస్పీగా వచ్చే దోసలు వేసుకోవచ్చు. అదెలానో ఇక్కడ తెలుసుకుందాం.

Dosa Batter: దోశ పిండి పల్చగా మారిందా.. టెన్షనొద్దు.. ఈ సింపుల్ చిట్కాలతో ఈజీగా సరిచేయండి
How To Fix Watery Dosa Batter
Anand T
|

Updated on: Oct 03, 2026 | 7:07 PM

Share

దోశలు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైన బ్రేక్‌ ఫాస్ట్.. అయితే దోశ పిండి కలిపే సమయంలో కొన్ని సార్లు వాటర్ ఎక్కవ పడి.. పిండి మొత్తం పలచగా మారుతుంది. దీంతో దోశలు సరిగ్గా రావు. అలాంటప్పుడు పిండిని ఎలా సరిదిద్దాలో చాలా మందికి తెలియదు.. కాబట్టి పలచగా మారిన పిండిని మళ్లీ దోశలకు సరిపేయే విధంగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం.

నీళ్లు ఎక్కువైనప్పుడు ఏం చేయాలి..

మీరు దోశల కోసం పిండి కలిపేటప్పుడూ.. ఎప్పుడైనా సరే నీటిని కొద్ది కొద్దిగా పోయాలి.. పొరపాటున నీరు ఎక్కువ పడి.. పండి పలచగా మారితే.. అందులో కొద్దికొద్దిగా కార్న్‌ఫ్లోర్ వేస్తూ నెమ్మదిగా కలపండి. పిండి సరైన స్థిరత్వానికి వచ్చాక, సరిపడా ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి కలుపుకుంటే సరి.. మీకు కవాల్సిన రీతిలో క్రిస్పీ దోశలు వేసుకోవచ్చు

బియ్యప్పిండి: పలచగా మారిన పిండిని.. సెట్ చేయడానికి ఇది కూడా బెస్ట్ ఆప్షన్.. ఇందుకోసం దోశ పిండిలో బియ్యప్పిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. దీనివల్ల దోశలు మరింత కరకరలాడుతూ వస్తాయి. అయితే పిండి మరీ గట్టిగా కాకుండా.. కొద్ది కొద్దిగా వేస్తూ మీకు కావాల్సిన విధంగా కలుపుకోండి.

రవ్వ: పలచగా మారిన దోశ పిండిని సరిచేయడానికి ఇది కూడా మంచి ఆప్షన్.. కానీ దీన్ని నేరుగా పిండిలో కలపవద్దు.. మొదట రవ్వలో కొద్దిగా పెరుగు వేసి.. దాన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకోండి. తర్వాత ఈ రుబ్బుకున్న పేస్ట్‌ను దోశ పిండిలో వేసి బాగా కలపండి. తర్వాత దీనిలో దోశలు వేసుకుంటే.. క్రిస్పీ, క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us