AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫా…! ఏం గుండె రా వాడిది.!! భర్త పక్కన ఉండగానే సమంతకు ఐ లవ్ యు చెప్పిన వ్యక్తి..

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు సినిమాల స్పీడ్ పెంచేశారు. ఓ వైపు నిర్మాతగా మరో వైపు హీరోయిన్ గా నటిస్తూ బిజీగా ఉన్నారు. మొన్నామధ్య శుభం అనే సినిమాతో నిర్మాతగా మారి మంచి విజయాన్ని అందుకుంది సామ్. ఇక ఇప్పుడు హీరోయిన్ గా మరోసారి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతుంది.

ఫా...! ఏం గుండె రా వాడిది.!! భర్త పక్కన ఉండగానే సమంతకు ఐ లవ్ యు చెప్పిన వ్యక్తి..
Samantha
Rajeev Rayala
|

Updated on: May 26, 2026 | 10:50 AM

Share

స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారనుంది. అనారోగ్యం ఇతర కారణాలతో సినిమాలకు గ్యాప్ ఇచ్చేసిన సమంత మళ్లీ ప్రొఫెషనల్ గా బిజీ అవుతోంది. వరుసగా సినిమాలకు సైన్ చేస్తోంది. అలాగే నిర్మాతగానూ బిజీ అవుతోంది. తన ప్రొడక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చ‌ర్స్ పై ప్రొడ‌క్ష‌న్ నెం.2గా ‘మా ఇంటి బంగారం’ను నిర్మిస్తోంది సామ్. అంతకు ముందు తన మ్యానర్ లో శుభం అనే సినిమా చేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ సినిమాలో కీలక పాత్రలోనూ కనిపించింది సామ్. కాగా రాజ్ నిడమూరి వివాహం చేసుకున్న తర్వాత సమంత చేస్తున్న సినిమా మా ఇంటి బంగారం. నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. చిత్రయూనిట్ స్టేజ్ పై కూర్చొని సినిమా విశేషాలు పంచుకుంటుండగా ఓ వ్యక్తి సడన్ గా స్తేజ్ పైకి దూసుకువచ్చాడు. స్టేజ్ పైకి వచ్చిన ఆ వ్యక్తి సమంత దగ్గరకు వెళ్లి మోకాళ్ళ పై కూర్చొని సామ్ కు పువ్వులు ఇచ్చాడు. అంతటితో ఆగలేదు ఐలవ్యూ సామ్ అంటూ ప్రపోజ్ చేశాడు. దాంతో సామ్ ఒక్కసారిగా ఉలిక్కి పడి.. ఆ తర్వాత అతను ఇచ్చిన పువ్వులను తీసుకోని అతనితో ఓ సెల్ఫీ తీసుకోని పంపించింది. అయితే ఇది జరుగుతున్న సమయంలో సామ్ భర్త రాజ్ పక్కనే ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఫన్నీ మ్యూజిక్ యాడ్ చేస్తూ వీడియోలు షేర్ చేస్తున్నారు. రాజ్ రియాక్షన్ చూడండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఓ వ్యక్తి స్టేజ్ పైకి పరిగెత్తుకు రావడంతో రాజ్ కూడా షాక్ అయ్యారు. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

సమంతకు స్టేజ్ పై ప్రపోజ్ చేసిన వ్యక్తి ( వీడియో ఇక్కడ చూడండి)

View this post on Instagram

A post shared by CINEMA (@cinema_2015)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us