AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: రష్యా చీఫ్ పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్‌కు రష్యా అణు క్షిపణుల తరలింపు..

బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఇటీవల పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత క్షిపణుల తరలింపు నిర్ణయం తీసుకున్నారు.

Russia Ukraine War: రష్యా చీఫ్ పుతిన్ కీలక నిర్ణయం.. బెలారస్‌కు రష్యా అణు క్షిపణుల తరలింపు..
Shaik Madar Saheb
|

Updated on: Jun 27, 2022 | 8:57 AM

Share

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. దీంతో కీలక నిర్ణయం తీసుకున్నారు, రష్యా చీఫ్‌ పుతిన్. అణుసామర్థ్య క్షిపణులను బెలారస్‌కు తరలించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని స్వయంగా పుతినే (Vladimir Putin) వెల్లడించారు. బాలిస్టిక్‌, క్రూజ్‌ క్షిపణులను అణువార్‌ హెడ్లతో ప్రయోగించవచ్చు. దీంతో వీటిని బెలారస్‌కు తరలించాలని నిర్ణయించారు. బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఇటీవల పుతిన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత క్షిపణుల తరలింపు నిర్ణయం తీసుకున్నారు. రానున్న కొన్ని నెలల్లో బెలారస్‌కు ఇసికందర్‌-ఎం టాక్టికల్‌ మిసైల్‌ వ్యవస్థలను అందించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు పుతిన్. ఈ వ్యవస్థల తరలింపుపై ఇరుదేశాల రక్షణ శాఖలు చర్చలు జరుపుతున్నాయని చెప్పారు. అయితే, ఇప్పటికే ఇసికందర్‌ క్షిపణులను బాల్టిక్‌ ప్రాంతంలోని కలినిన్‌గ్రాడ్‌లో రష్యా మోహరించింది. నాటో దేశాలైన పోలాండ్‌-లిథువేనియా మధ్యలో కలినిన్‌ గ్రాడ్‌ ప్రాంతం ఉంది. రష్యా నుంచి సామాగ్రిని తమ భూభాగం పై నుంచి తరలించడాన్ని లిథువేనియా ఇటీవలే నిషేధించింది. ఈ నేపథ్యంలో బెలారస్‌కు అణు సామర్థ్య క్షిపణులను రష్యా అందజేస్తుండటం చర్చనీయాంశమైంది. దీనిపై బెలారస్‌ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. లిథువేనియా తీసుకున్న నిర్ణయం ఓ రకంగా యుద్ధం ప్రకటించడం వంటిదేనని, దానిని అస్సలు ఆమోదించకూడదని కామెంట్‌ చేయడం ఆందోళనలు మరింత పెంచుతోంది.

యుద్ధం తర్వాత మొదటిసారి పర్యటనకు పుతిన్..

ఇదిలాఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడికి ఆదేశించిన తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. మొదటిసారి అంతర్జాతీయ పర్యటనలు చేయనున్నారు. పుతిన్ తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్‌లను సందర్శించనున్నారు. ఈ రెండు సందర్శనల తర్వాత రష్యా అధ్యక్షుడు మాస్కోలో చర్చల కోసం ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడోను కూడా కలుస్తారని రష్యా ప్రతినిధులు వెల్లడించారు. జీ7 దేశాల ఆంక్షల అనంతరం అజర్‌బైజాన్, కజకిస్తాన్, ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్ నాయకులతో సహా కాస్పియన్ దేశాల శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ హాజరై పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వారర్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..