AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Gold: ఏ దేశం వద్ద ఎంత బంగారం ఉందో తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఇండియా స్థానం ఎక్కడో తెలుసా?

Largest Gold Reserves Countries in the World: పండుగ అయినా, పెళ్లి అయినా, పెట్టుబడి ఆలోచన అయినా, ముందుగా గుర్తుకు వచ్చేది బంగారం. భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణాలు మాత్రమే కాదు, అది ఒక సురక్షితమైన పెట్టుబడి, భవిష్యత్తుకు ఆధారం. అయితే సంక్షోభ సమయాల్లో కరెన్సీ విలువలు కొన్నిసార్లు పడిపోవచ్చు. అలాంటి సమయాల్లో దేశ ఆర్థిక పరిస్థితి ఆదుకునేందుకు బంగారం ఎతంగానో దోహదపడుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకులు తమ ట్రెజరీలలో వేల టన్నుల బంగారాన్ని దాచుకుంటాయి. అయితే ఇప్పుడు ప్రపంచలోనే అత్యధిక బంగారు నిల్వు కలిగిన దేశాలు ఏవో మనం తెలుసుకుందాం.

Global Gold: ఏ దేశం వద్ద ఎంత బంగారం ఉందో తెలిస్తే నోరెళ్లబెడతారు.. ఇండియా స్థానం ఎక్కడో తెలుసా?
Top 8 Countries With Highest Gold Reserves
Anand T
|

Updated on: Mar 16, 2026 | 1:04 PM

Share

సంక్షోమ సమయాల్లో మనం బంగారన్ని ఎలాగైతే ఇంట్లో దాచుకుంటామో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి బంగారాన్ని కేంద్ర బ్యాంకుల్లో దాచుకుంటాయి. అవును ప్రపంచ మార్కెట్లో మాంద్యం లేదా యుద్ధం వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు డాలర్ లేదా ఇతర కరెన్సీలు విలువడు పడిపోవచ్చు, కానీ బంగారం మాత్రం వాటికి ప్రభావితం కాదు. ఆలాంటి సందర్బాల్లో బంగారు నిల్వలే దేశాన్ని ఆర్థిక సమస్యల నుంచి కాపాడుతాయి. అందుకే ప్రపంచంలోని కేంద్ర బ్యాంకులు తమ ట్రెజరీలలో వేల టన్నుల బంగారాన్ని ఉంచుతాయి.

ప్రపంచంలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన టాప్ -8 దేశాలు ఇవే

అమెరికా: ప్రపంచలో అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా మొదటి స్థానంలో ఉంది. అమెరికా మొత్తం 8,133.5 టన్నులు బంగారు నిల్వలను కలిగి ఉంది. అమెరికాలోని ఈ నిల్వలు మొత్తం ఫోర్ట్ నాక్స్, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్‌లో భారీ భద్రత మధ్య ఉంటాయి. అమెరికా వద్ద ఉన్న ఈ బంగారు నిల్వలై ప్రపంచ మార్కెట్‌పై డాలర్ పట్టును బలంగా ఉంచుతున్నాయి.

జర్మనీ: ఇక రెండో ప్లేస్‌ను జర్మనీ కైవసం చేసుకుంది. జర్మనీలో మొత్తం 3,359.2 టన్నులు బంగారం ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ తన బంగారు నిల్వలను పెంచుకుంది. ఇటీవలి కాలంలో, జర్మనీ తన బంగారాన్ని విదేశీ బ్యాంకుల నుండి ఫ్రాంక్‌ఫర్ట్‌కు తిరిగి తీసుకువచ్చింది.

ఇటలీ: ఇక మూడో ప్లేస్‌లో ఇటలీ నిలిచింది. ఇటలీలో 2,451.8 టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఇటలీ ఈ స్థిరమైన బంగారు నిల్వలను కాపాడుకుంటూ వస్తోంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడిన సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇటలీ ఈ బంగారు నిల్వలు ఉపయోగించి సమస్యలను పరిష్కరించుకుంటుంది.

ఫ్రాన్స్: ఇక ప్రపంచలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో ఫ్రాన్స్ నాలుగో స్థానంలో ఉంది. ప్రాన్స్‌లో మొత్తం 2,437.0 టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయి. ఫ్రాన్స్‌లో ఉన్న ఈ బంగారు నిల్వలు బ్రెట్టన్ వుడ్స్ యుగం నాటివని చెబుతారు. ఈ బంగారు నిల్వలే బ్యాంక్ ఆఫ్ ఫ్రాన్స్‌కు రిజర్వ్ ఆస్తిగా, యూరోను బలోపేతానికి సహాయపడుతున్నాయి..

రష్యా: ఇక 2,332.7 టన్నులు బంగారు నిల్వలో ప్రపంచలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో రాష్యా ఐదో స్థానంలో ఉంది. గత 10 ఏళ్లలో రష్యా అత్యధికంగా తన బంగారు నిల్వలను పెంచుకుంది. డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, పాశ్చాత్య ఆంక్షలు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయకుండా ఉండేందుకు రష్యా తన బంగారు నిల్వలను పెంచుకుంది.

చైనా: ఇక ఆరో స్థానంలో చైనా ఉంది. చైనాలో మొత్తం 2,303.5 టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయి. అయితే చైనా బంగారాన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా కొనుగోలు చేయడంతో కూడా టాప్‌లోనే ఉంది. అధికారికంగా బంగారు నిల్వల్లో చైనా ఆరవ స్థానంలో ఉన్నప్పిటకీ.. కొందరు నిపుణులు మాత్రం చైనా వాస్తవ నిల్వలు ఈ సంఖ్య కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉండవచ్చని చెబుతారు.

స్విట్జర్లాండ్: ఇక ఏడో స్థానంలో స్విట్జర్లాండ్ ఉంది. ఈ దేశంలో దాదాపు 1,040.0 టన్నులు బంగారు నిల్వలు ఉన్నాయి. స్విట్జర్లాండ్ ప్రపంచంలోనే అత్యధిక ‘GDP నుండి బంగారం నిష్పత్తి’ కలిగి ఉన్న దేశం. స్విస్ నేషనల్ బ్యాంక్ తన కరెన్సీ స్థిరత్వాన్ని, ప్రపంచ ఆర్థిక కేంద్రంగా దాని ఖ్యాతిని కాపాడుకోవడానికి స్విట్జర్లాండ్ ఈ బంగారు నిల్వలను ఉపయోగిస్తుంది

భారత్: ప్రపచంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన దేశాల్లో భారత్ 8వ స్థానంలో ఉంది. అధికారికంగా మన దేశంలో కేవలం 880.2 టన్నులు బంగారు నిల్వలు మాత్రమే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లలో హెచ్చుతగ్గులను ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. అధికారిక నిల్వలతో పాటు, భారతీయ కుటుంబాలు ఆభరణాల రూపంలో అదనంగా 25,000 టన్నుల బంగారాన్ని కలిగి ఉంటాయని అంచనా. దీనితో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యక్తిగత బంగారం కలిగి ఉన్న దేశంగా నిలిచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us