బైక్ పొగ పీల్చి అన్నమయ్య జిల్లా పుంగనూరులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. రిపేర్ చేసిన బైక్ను దొంగల భయంతో ఇంట్లో ఉంచి, ఇంజిన్ ఆన్ చేసి ఉంచడంతో గది నిండా పొగ చేరింది. మురళి తండ్రి, ముగ్గురు పిల్లలు ఈ విషాదానికి బలయ్యారు. మురళి, అతని భార్య మేడపై పడుకోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.