AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గోల్డ్‌చైన్‌ కొట్టేసిన చీమలు.. ఏ సెక్షన్లపై కేసు పెట్టాలంటోన్న ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..

Viral Video: చీమలను చాలామంది తక్కువగా అంచనా వేస్తుంటారు. అయితే 'బలవంతమైన సర్పము.. చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ' అని సుమతీ శతకంలో చెప్పినట్లు చీమలకు కూడా చాలా బలం ఉంటుంది.

Viral Video: గోల్డ్‌చైన్‌ కొట్టేసిన చీమలు.. ఏ సెక్షన్లపై కేసు పెట్టాలంటోన్న ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌.. నెట్టింట్లో వైరల్‌ వీడియో..
Basha Shek
| Edited By: |

Updated on: Jun 30, 2022 | 7:15 AM

Share

Viral Video: చీమలను చాలామంది తక్కువగా అంచనా వేస్తుంటారు. అయితే ‘బలవంతమైన సర్పము.. చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ’ అని సుమతీ శతకంలో చెప్పినట్లు చీమలకు కూడా చాలా బలం ఉంటుంది. ఒక్కోసారి అవి చేసిన పనులు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా. ఎందుకంటే ఈ చిన్న చీమలు ఏకంగా బంగారపు గొలుసు కొట్టేశాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారం చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద పోస్టు చేసిన ఈ వీడియోలో కొన్ని చీమలు కలిసి ఒక బంగారపు గొలుసును నెమ్మదిగా ఎత్తుకెళ్లిపోతున్నాయి.

చక్కెర ఇచ్చి చైన్‌ తీసుకుందాం.. సాధారణంగా చీమలు పంచదార, పప్పులను దొంగతనం చేస్తాయి. అయితే అవి ఏకంగా బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లాయి. ఈక్రమంలో పదుల సంఖ్యలో గోల్డ్ చైన్‌ను ఎత్తుకెళ్తున్న చీమలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సుశాంత నంద..’బుల్లి గోల్డ్ స్మగ్లర్లు.. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఈ చీమలపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి?’ అని నెటిజన్లను అడిగారు. ఐఎఫ్‌ఎస్‌ అధికారి ట్వీట్‌కు నెటిజెన్లు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. ‘చీమలపై పెట్టాల్సింది ఐపీసీ సెక్షన్ కింద కాదు, ఏపీసీ (యానిమల్ పీనల్ కోడ్)’ అంటూ ఒకరు స్పందించారు. చీమల దొంగనతం వెనకున్న మాస్టర్‌మైండ్‌ను అర్థం చేసుకోవాలని మరొకరు కామెంట్‌ చేయగా .. చీమలకు కొంత పంచదార ఇచ్చి గోల్డ్‌ చైన్‌ను తీసుకుందాం’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మరికొందరేమో ఈ చీమలన్నీ కలిసి మరోసారి ఐకమత్యం బలాన్ని చూపించాయని మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!