Health Tips For Kids: వర్షాకాలం వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్‌ ఫుడ్స్‌ ఇవ్వాల్సిందే..

Monsoon Diet For Kids: వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా వాతావరణంలోని అనూహ్య మార్పులు పెద్దలతో పాటు పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.

Health Tips For Kids: వర్షాకాలం వ్యాధుల నుంచి పిల్లలను రక్షించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ సూపర్‌ ఫుడ్స్‌ ఇవ్వాల్సిందే..
Monsoon Diet For Kids
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2022 | 7:34 AM

Monsoon Diet For Kids: వేసవి నుంచి ఉపశమనం కలిగిస్తూ వర్షాకాలం వచ్చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా వాతావరణంలోని అనూహ్య మార్పులు పెద్దలతో పాటు పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. దగ్గు, జలుబు, ఫ్లూ లాంటి సీజనల్‌ వ్యాధులతో పాటు డయేరియా లాంటి సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా పిల్లల్లో అతిసారం సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో తగిన మందులు ఇవ్వడంతో పాటు పిల్లలకు పోషకాహారం ఇవ్వడం ఎంతో ముఖ్యం. మరి డయేరియా నుంచి బయటపడడానికి పిల్లలకు ఎలాంటి ఆహారమివ్వాలో తెలుసుకుందాం రండి.

అరటి పండ్లు..

అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది డయేరియా సమస్యలను నివారించడంలో బాగా సహాయపడుతుంది. పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. పెరుగుతో కలిపి అరటిపండును తీసుకోవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నీళ్లు..

అతిసారం సమయంలో శరీరంలో నీటి కొరత బాగా ఉంటుంది. డీహైడ్రేషన్ సమస్యలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితుల్లో హైడ్రేటెడ్ గా ఉండటానికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇది శరీరంలో నీటి స్థాయులను పెంచడంతో పాటు ఎనర్జిటిక్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

పెరుగు

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అదేవిధంగా డయేరియా సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో క్యాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది.

రైస్ వాటర్

పిల్లలకు డయేరియా ఉంటే వారికి రైస్‌ ఆటర్‌ కూడా ఇవ్వవచ్చు. ఈ సూప్ చాలా ఆరోగ్యకరమైనది అలాగే చాలా రుచికరమైనది. ఇందులోని పిండి పదార్థాలు డయేరియా సమస్యల నుంచి ఉపశమనం కలిగించేలా పనిచేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..