Randeep Hooda: పాడె మోసి మాట నిలబెట్టుకున్న హీరో.. ఆమె కట్టిన రాఖీని మర్చిపోలేనంటూ ఎమోషనల్‌..

బాలీవుడ్‌కు చెందిన వైవిధ్యమైన నటుల్లో రణ్‌దీప్‌ హుడా (Randeep Hooda) ఒకడు. హీరోగా నటిస్తూనే విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పిస్తూ బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించుకున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో...

Randeep Hooda: పాడె మోసి మాట నిలబెట్టుకున్న హీరో.. ఆమె కట్టిన రాఖీని మర్చిపోలేనంటూ ఎమోషనల్‌..
Randeep Hooda
Follow us
Basha Shek

| Edited By: Ravi Kiran

Updated on: Jun 29, 2022 | 7:34 AM

బాలీవుడ్‌కు చెందిన వైవిధ్యమైన నటుల్లో రణ్‌దీప్‌ హుడా (Randeep Hooda) ఒకడు. హీరోగా నటిస్తూనే విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పిస్తూ బాలీవుడ్‌ ప్రేక్షకుల్లో అభిమానం సంపాదించుకున్నాడీ హ్యాండ్సమ్‌ హీరో. కాగా రణ్‌దీప్‌ ప్రధాన పాత్రలో 2016లో విడుదలైన చిత్రం సరబ్‌ జిత్‌. ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో పాక్‌లో మరణశిక్షకు గురైన సరబ్‌జిత్‌ బయోపిక్‌గా ఇది తెరకెక్కింది. ఇందులో సరబ్‌జిత్‌ పాత్రలో రణ్‌దీప్‌ నటించగా, అతని సోదరి దల్బీర్‌ కౌర్‌ పాత్రలో ఐశ్వర్యారాయ్‌ కనిపించింది. కాగాఈ సినిమా షూటింగ్ సమయంలో సరబ్‌జిత్‌ సింగ్‌ సోదరి దల్బీర్‌ కౌర్‌కు రణ్‌దీప్‌ హుడాకు మంచి అనుబంధం ఏర్పడింది. రణ్‌దీప్‌ హుడాలో తన సోదరుడు సరబ్‌జిత్‌ సింగ్‌ను చూసుకుంటున్నట్లుగా ఆమె చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే రణ్‌దీప్‌ను దల్బీర్‌ కౌర్ ఒక కోరిక కోరింది. తాను చనిపోయినప్పుడు ఆమెకు ‘కంధ’ (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాల్సిందిగా అడిగింది. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నాడు రణ్‌దీప్‌.

ఇంత త్వరగా వెళ్లిపోతావనుకోలేదు..

ఇవి కూడా చదవండి

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచింది దల్బీర్‌ కౌర్‌. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సోదరుడిలా దల్బీర్‌ కౌర్‌ దహన సంస్కరాలు నిర్వహించాడు రణ్‌దీప్‌. ఈ విషయంపై తన ఇన్‌స్టాలో ఆమె చివరిసారిగా చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ.. ‘నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. కానీ నేను వెళ్లేసరికి ఆమె ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. దల్బీర్‌ కౌర్‌జీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళ్లి పోతారని అనుకోలేదు. ఆమె తన ప్రియమైన సోదరుడు సరబ్‌జిత్‌ సింగ్‌ను కాపాడుకునేందుకు ఎంతో పోరాటం చేసింది. ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతున్ని. ఆమె కట్టిన రాఖీని నా జీవితంలో మర్చిపోలేను’ అని ఎమోషనల్‌ అయ్యాడీ హీరో. ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరలవుతోంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పాడె మోసి దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించిన రణ్‌దీప్‌పై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..