Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: అసోం ప్రజలకు అండగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్.. సీఎం నిధికి భారీ సాయం

Assam Floods: అసోంలో భారీ వర్షాలు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రెండువారాలుగా కురుస్తున్న వానలతో అష్టకష్టాలు పడుతున్నారు జనం. ముంచెత్తుతున్న వరదలు కన్నీటిని తెప్పిస్తున్నాయి.

Aamir Khan: అసోం ప్రజలకు అండగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్.. సీఎం నిధికి భారీ సాయం
Aamir Khan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 29, 2022 | 6:55 AM

అసోంలో భారీ వర్షాలు(Assam Floods) జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. రెండువారాలుగా కురుస్తున్న వానలతో అష్టకష్టాలు పడుతున్నారు జనం. ముంచెత్తుతున్న వరదలు కన్నీటిని తెప్పిస్తున్నాయి. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. ప్రధాన రోడ్లపై వరద ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాహనాలు బయటకు తీయలేని దుస్థితి నెలకొంది. పలుచోట్ల వాహనాలు నీళ్లల్లో మునిగిపోయాయి. వరదలో పాదచారులు పడరాని పాట్లు పడుతున్నారు. భారీ వర్షాలతో అసోంలోని పలు ప్రాంతంలోని ఇళ్లన్నీ జలమయంగా మారాయి. ఇళ్లల్లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. సగం నీట మునిగిన ఇళ్లల్లో ఉండలేని పరిస్థితులు దాపురించాయి. మోకాళ్ల లోతు నీళ్లల్లో అవస్థలు పడుతున్నారు జనం. వరద నీటితో పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఉండేందుకు ఇళ్లు లేక.. తిండి లేక నరకయాతన పడుతున్నారు ప్రజలు.

కుంభవృష్టి వానలతో చెరువు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కొన్ని ప్రాంతాల్లో చెరువు కట్టలు తెగిపోయి వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది. చెక్‌డ్యాంలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులన్నీ నిండి అలుగు పోస్తుండడంతో స్థానికులు భయం.. భయంగా జీవిస్తున్నారు. మరోవైపు.. పంట పొలాల్లో వరద నీరు వచ్చి చేరింది. వరదతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. వేసిన పంటకు కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పంట పొలాలన్నీ జలమయంగా మారాయి. వరదతో పంట నష్టపోయిన రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మొత్తంగా అసోం వరదలతో 20లక్షల మంది ప్రభావితులయ్యారు. వీరిని ఆదుకోవడానికి బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముందుకు వచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షలు అందించారు అమీర్. సీఎం హిమంతా బీష్వ శర్మ. ఈ మేరకు సీఎం ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ తెలుపుతూ.. అమీర్ ఖాన్ పెద్దమనసును కొనియాడారు. అమీర్ తర్వాత మరికొంతమంది సినిమా తారలు అసోం ను ఆదుకునేందుకు ముందుకు వస్తారేమో చూడాలి.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి : 

ఇవి కూడా చదవండి