Megastar Chiranjeevi: ఒకే వేదికపై సందడి చేయనున్న ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి.. ఎప్పుడు, ఎక్కడంటే ?

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా

Megastar Chiranjeevi: ఒకే వేదికపై సందడి చేయనున్న ప్రధాని మోడీ, మెగాస్టార్ చిరంజీవి.. ఎప్పుడు, ఎక్కడంటే ?
Megastar Chiranjeevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2022 | 8:28 PM

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు భీమవరం ముస్తాబవుతోంది. ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవంలో భాగంగా అల్లూరి సీతారామరాజు జయంతి వేడులను జూలై 4న భీమవరంలో నిర్వహించనున్నారు.. ఈ వేడుకకు ప్రధానీ మోడీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడకలలో భీమవరంలోని పెద అమీరం ప్రాంతంలో అల్లూరి విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు.. అయితే తాజాగా మెగాస్టార్‌ చిరంజీవికి భారత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. ప్రధాని మోడీ పాల్గొనే కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది.

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ఈ మేరకు చిరంజీవికి ఆహ్వాన లేఖని పంపించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం `ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌` పేరుతో వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసమే చిరంజీవిని ఆహ్వానించడం విశేషం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. ఆయన భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ చేస్తారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.

ఇవి కూడా చదవండి
Megastar

Megastar

అలాగే పలు ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని చిరంజీవికి పంపిన లేఖలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని చిరంజీవిని మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. ప్రధాని మోదీ నుంచి ఆహ్వానం అందడం అంత సులభం కాదు. కొంత మందికి మాత్రమే ఈ రకమైన ఆహ్వానం అందుతుంది. అలాంటి అరుదైన వ్యక్తుల జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు.