AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Itlu Maredumilli Prajaneekam: అడవుల్లో మారేడుమిల్లి ప్రజానీకం టీం ఇంతగా కష్టపడ్డారా ?.. ఆకట్టుకుంటున్న వీడియో..

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి.. మంగవారం ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ రిలీజ్ చేశారు...

Itlu Maredumilli Prajaneekam: అడవుల్లో మారేడుమిల్లి ప్రజానీకం టీం ఇంతగా కష్టపడ్డారా ?.. ఆకట్టుకుంటున్న వీడియో..
Maredumilli Prajaneekam
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2022 | 2:37 PM

Share

ఎప్పుడు కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన హీరో అల్లరి నరేష్ (Allari Naresh) ఇప్పుడు రూటు మార్చారు.. నాంది సినిమాతో నటుడిగా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కిన నాంది సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‏గా నిలిచింది.. ఈ సినిమా తర్వాత నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం మారేడుమిల్లి ప్రజానీకం (Itlu Maredumilli Prajaneekam).. ఈ చిత్రాన్ని ప్రముఖ ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌, నిర్మాణంలో, మ‌రో నిర్మాణ‌ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్‌.మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు, బాలాజీ గుత్త నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని పెంచేశాయి.. మంగవారం ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ రిలీజ్ చేశారు… మారేడుమిల్లి అడవుల్లో 55 రోజుల పాటు షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు.. ఈ సినిమా కోసం 250 మంది అడవుల్లో కష్టపడ్డారని తెలిపారు.. ఈ సినిమా కోసం మారేడుమిల్లి అడవుల్లో ఇప్పటివరకు ఎవరు షూట్ చేయని 22 లొకేషన్స్ లో తాము షూటింగ్ చేశామని.. ఉదయాన్నే 3 గంటలకు లేచి కాలినడక లొకేషన్స్ కు వెళ్లడం చూపించారు.. షూటింగ్ కు సంబంధించిన విజువల్స్ పై టీజర్ కట్ చేసి రీలీజ్ చేశారు.. ఇందుకు సంబంధించిన పూర్తి వీడియోను ఈనెల 30న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో నరేష్ కు జోడీగా ఆనంది న‌టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.