AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maruthi: ఆడిటోరియం సైలెంట్ అయ్యేలా మెగాస్టార్ గురించి ఎమోషనల్ అయిన మారుతి

అందరూ టాలెంటెడే.. కాని వారి వారి టాలెంట్ గుర్తించంలో మాత్రం ఎప్పుడూ ఎంతో కొంత తడబాటే.. అలా తడబడుతున్న వారికి ఓ భరోసా దొరికితే.. వెన్ను తట్టి మరీ ప్రయత్నించు అని ప్రోత్సహిస్తే.. నీకు తెలియకుండానే డైరెక్షన్‌ ఇస్తే.. ఎలా వుంటుంది

Maruthi: ఆడిటోరియం సైలెంట్ అయ్యేలా మెగాస్టార్ గురించి ఎమోషనల్ అయిన మారుతి
Maruthi
Rajeev Rayala
|

Updated on: Jun 27, 2022 | 8:16 PM

Share

అందరూ టాలెంటెడే.. కాని వారి వారి టాలెంట్ గుర్తించంలో మాత్రం ఎప్పుడూ ఎంతో కొంత తడబాటే.. అలా తడబడుతున్న వారికి ఓ భరోసా దొరికితే.. వెన్ను తట్టి మరీ ప్రయత్నించు అని ప్రోత్సహిస్తే.. నీకు తెలియకుండానే డైరెక్షన్‌ ఇస్తే.. ఎలా వుంటుంది. అచ్చం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయిన మారుతి(Maruthi)కథలా ఉంటుంది. బందరులో బ్యానర్లు కట్టుకునే ఈ ఆర్టిస్ట్‌.. యాడ్‌ డిజైనర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. చిరు ప్రజారాజ్యం కోసం పని చేశారు. అలా ఓ సందర్భంలో నీలో ఓ డైరెక్టర్ ఉన్నాడోయ్‌..అని చిరు అన్న ఒక్క మాటతో .. టాలీవుడ్‌ డైరెక్టర్ అయ్యాడు. ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు మారుతి. రైటర్ కమ్‌ డైరెక్టర్.. అందులోనూ మెగా ఫ్యాన్స్.. ఇక చిరు ఎదురుగా వచ్చి కూర్చుంటే ఆగుతారా చెప్పండి.. మాటలతో రెచ్చిపోరు. తన అభిమాన హీరోపై ఉన్న ఇష్టాన్ని తన మాటలతో అందరికీ చూపించేరు మారుతి. తన ‘పక్కా కమర్షయల్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరును తన మాటలతో దేవున్ని చేసేశారు. పనిలో పనిగా.. ఈ సినిమా ప్రొడ్యూసర్.. చిరు పక్కనే కూర్చున్న అల్లు అరవింద్‌ను కుబేరున్ని చేసేశారు మారుతి. అయితే ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

సినిమాల్లో కామెడీ పండిస్తూ..అందర్నీ కడుపుబ్బా నవ్వించే డైరెక్టర్ మారుతి .. తాజాగా తన జర్నీ ఎలా సాగిందో చెప్పేశారు. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్లో తను ఎలా డైరెక్టర్‌ అయింది చెప్పేశారు. స్టేజ్‌ ఎక్కీ ఎక్కగానే.. అందర్నీ తన మాటలతో సైలెంట్ చేసిన మారుతి.. అదే మాటలతో అందర్నీ ఆకట్టుకున్నారు. చిరు ముందే డైరెక్టర్ గా నిలబడటం.. చాలా సంతోషంగా ఉందన్నారు. చిరంజీవి సినిమాలు చూస్తూనే పెరిగానని.. అలాంటి.. చిరు మాటలే తనను డైరెక్టర్ అయ్యేలా కూడా చేశాయాని కాస్త ఎమోషనల్ అయ్యారు. మారుతి చిరుతో జరిగిన ఒకప్పటి సీన్ ను గుర్తు చేసుకున్నారు. తనకు డైరెక్షన్‌ దారి చూపించింది.. చిరునే అని చెప్పిన మారుతీ.. ఆయనకే ఫస్ట్ యాక్షన్ చెప్పానని అసలు విషయం చెప్పి.. అందర్నీ షాక్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..