Upasana: అపోలో ఆసుపత్రుల్లో వారికి ఉచితంగా వైద్యం.. ట్విట్టర్‌ వేదికగా ప్రకటించిన ఉపాసన..

Upasana: ఉపాసన తెలుగు వారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు...

Upasana: అపోలో ఆసుపత్రుల్లో వారికి ఉచితంగా వైద్యం.. ట్విట్టర్‌ వేదికగా ప్రకటించిన ఉపాసన..
Follow us
Narender Vaitla

|

Updated on: Jun 27, 2022 | 2:31 PM

Upasana: ఉపాసన తెలుగు వారికి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. అపోలో లైఫ్‌ ఛైర్‌ పర్సన్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉపాసన మంచి బిజినెస్‌ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఇక ఓ వైపు వ్యాపార రంగంలో రాణిస్తూనే మరోవైపు సామాజిక కార్యక్రమల్లోనూ ముందుంటారు ఉపాసన. పలు రకాల సేవా కార్యక్రమంలో పాల్గొంటూ తనది మంచి మనసు అని చాటుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ వేదికగా ఉపాసన ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు.

వన్యప్రాణి సంరక్షణ కోసం, జంతు, జీవ రాశుల పోషణ, సంరక్షణ కోసం పని చేసే వారికి తమ అపోలో హాస్పిటల్స్ చైన్ ద్వారా ఉచిత వైద్యాన్ని ఇవ్వాలని ఇవ్వాలని ఉపాసన ప్రకటించారు. ఇందుకోసం అపోలో ఫౌండేషన్, డబ్లూడబ్లూఎఫ్‌తో కలిసి పని చేయనున్నారు. అపోలో ఫౌండేషన్‌, డబ్లూడబ్లూఎఫ్‌తో ఒప్పందానికి సంబంధించిన ఫొటోలను ట్వీట్ చేసిన ఉపాసన.. ‘వన్యప్రాణి సంరక్షణలో భాగంగా అడవిలో గాయాలపాలైన ఫారెస్ట్ రేంజర్‌లు, ఇతర ఫారెస్ట్ సిబ్బందికి ఎలాంటి వైద్య సేవలు అందించడానికి అయినా తాము ముందుంటామని’ రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఉపాసనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..