- Telugu News Photo Gallery Political photos Minister Harish Rao inaugurates Centralized Kitchen, Hare Krishna Trust which has started Lunch for 5 Rupees at Government hospitals
Hyderabad: హరే కృష్ణ ట్రస్ట్ 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రూ. 5 లకే భోజనం..సెంట్రలైజెడ్ కిచెన్ ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
Hyderabad: హైదరాబాద్ నగర పరిధిలో 18 ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకులకు రూ.5 లకే భోజనం తెలంగాణ సర్కార్ తో కలిసి హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ అందిస్తోంది. ఈ ఆసుపత్రుల్లో భోజనం అందించేందుకు హరేకృష్ణ ట్రస్ట్ ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను ఈరోజు మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
Updated on: Jun 27, 2022 | 1:01 PM

హరే కృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ట్రస్ట్ నార్సింగిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజెడ్ కిచెన్ ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. భోజనామృతం, అన్నపూర్ణ, సద్దిమూట.. ఇలా పేరు ఏదైనా, హరే రామతో కలిసి ప్రభుత్వం లక్షల మంది ఆకలి తీరుస్తుందని చెప్పారు హరీశ్ రావు.

హైదరాబాద్ లో ఈ 18 దవాఖానలకు అన్ని జిల్లాల నుంచి చికిత్స కోసం భారీ సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఒక రోగి వెంట ఒకరో ఇద్దరో సహాయకులు కూడా వస్తారు. ముఖ్యంగా రోగికి సర్జరీలు జరిగినప్పుడు, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలకు చికిత్స కోసం వచ్చే రోగులు, వారి అటెండెంట్స్ రోజుల తరబడి నగరంలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న రోగులకు ప్రభత్వమే ఉచితంగా పోషకాహారం అందిస్తోంది. కానీ వారికి తోడుగా వచ్చేవారు మాత్రం ఆకలికి అలమటిస్తున్నారు. రోగులకు సహాయం కోసం వస్తున్నవారి అవస్థలను సీఎం కేసీఆర్ గుర్తించారని చెప్పారు

ఇప్పటికే ఆస్పత్రుల వద్ద రోగుల సహాయకుల కోసం నైట్ షెల్టర్లు నిర్మించారు. తాగు నీటి వసతి కల్పించారు. అన్నపూర్ణ భోజన కేంద్రాలు ఒక పూట ఆకలిని తీరుస్తున్నాయి. అయినా వారు అర్ధాకలితో ఉంటున్నారని సీఎం కేసీఆర్ గ్రహించారు. దీంతో కేసీఆర్ మానవత్వంతో ఆలోచించి రోగుల సహాయకులకు 5 రూపాయలకే మూడు పూటలా కడుపు నిండా భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్ లో చెప్పినట్లు అమలు చేశారు.

18 ఆసుపత్రుల్లో రోజు సుమారు 20 వేల మందికి లబ్ది చేకూరుతుందని అన్నారు మంత్రి హరీశ్ రావు. ప్రభుత్వం ఒక్కో ప్లేట్ భోజనానికి 21 రూపాయలు సబ్సిడీ ఇస్తోంది. ఈ భోజనం కోసం ప్రభుత్వం ఏటా రూ. 38.66 కోట్లను ఖర్చు చేస్తోందన్నారు. ఇప్పటికే భోజనం తినడానికి అవసరమైన నీటి సదుపాయం,షెల్టర్స్, ఫ్యాన్లు వంటివి టీఎస్‌ఎండీసీ ఏర్పాటు చేసిందని తెలిపారు.

రోగి డైట్ ఛార్జీలను రెట్టింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీ.బి., క్యాన్సర్ తదితర రోగులకు బలవర్ధకమైన ఆహారం అందించడం కోసం బెడ్ ఒక్కంటికి ఇచ్చే డైట్ ఛార్జీలను 56 రూపాయలనుంచి 112 రూపాయలకు పెంచామని తెలిపారు. సాధారణ రోగులకు ఇచ్చే డైట్ ఛార్జీలు బెడ్ ఒక్కంటికి 40 రూపాయలనుంచి 80 రూపాయలకు పెంచాం. దీని కోసం ప్రభుత్వం ప్రతి ఏటా 43.5కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందన్నారు మంత్రి.

పారిశుధ్యకార్మికులకు, ఇతర సిబ్బందికి వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బడ్జెట్ లో ప్రభుత్వం బెడ్ ఒక్కంటికి చేసే పారిశుద్ద్య ఖర్చును 5000 నుంచి 7500 రూపాయలకు పెంచింది. ఇందు కోసం ప్రభుత్వం రూ. 338 కోట్లను ప్రతి సంవత్సరం వెచ్చించనుందన్నారు.

ఒకవైపు గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులను బలోపేతం చేస్తూనే.. మరో వైపు కొత్త ఆసుపత్రుల నిర్మాణం ప్రభుత్వం చేస్తున్నది.పేదలకు అత్యాధునిక, నాణ్యమైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక చర్యలు తీసుకుంటున్నారు ఇవి విజయవంతం కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు అవార్డులు వస్తున్నాయన్నారు మంత్రి హరీశ్ రావు.





























