AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyanka Chopra: భర్తతో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న గ్లోబల్‌ స్టార్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న పిక్స్..

Priyanka Chopra: కెరీర్‌ పరంగా నిత్యం బిజీ బిజీగా గడిపే సెలబ్రిటీలు ఏమాత్రం ఖాళీ సమయం దొరినికా వెకేషన్‌కు వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన..

Priyanka Chopra: భర్తతో కలిసి బీచ్‌లో ఎంజాయ్‌ చేస్తున్న గ్లోబల్‌ స్టార్‌.. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోన్న పిక్స్..
Priyanka Chopra
Narender Vaitla
|

Updated on: Jun 27, 2022 | 12:42 PM

Share

Priyanka Chopra: కెరీర్‌ పరంగా నిత్యం బిజీ బిజీగా గడిపే సెలబ్రిటీలు ఏమాత్రం ఖాళీ సమయం దొరినికా వెకేషన్‌కు వెళ్తుంటారు. మరీ ముఖ్యంగా సినీ తారల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే సినీ తారలు ఖాళీ సమయంలో సేద తీరుతుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌ వరకు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇలా నిత్యం వెకేషన్స్‌తో ఎంజాయ్‌ చేసే వారిలో గ్లోబాల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా ఒకరనే విషయం తెలిసిందే. భర్త నిక్‌ జోనస్‌తో కలిసి ప్రియాంక చేసే సందడి అంతా ఇంతకాదు. అడపాదపడా వీరి వెకేషన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటాయి.

తాజాగా ఇలాంటి ఫొటోలే కొన్ని సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ క్యూట్ కపుల్ అట్లాంటిక్‌ సముద్రంలోని టర్క్‌ అండ్‌ కైకోస్‌ దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రపంచానికి దూరంగా ఉన్నట్లుండే ఈ ఐల్యాండ్‌లో ప్రకృతి అందాలను జంట ఆస్వాదిస్తోంది. బీచ్‌ ఒడ్డున ఈ జంట రొమాంటిక్‌ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోలను పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే సుమారు 15 లక్షల మంది నెటిజన్లు లైక్‌ చేయడం విశేషం. ఇక ఈ ఫొటోలకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రన్‌వీర్‌ సింగ్‌తో పాటు మరికొందరు సెలబ్రిటీలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా జనవరిలో తల్లైన విషయం తెలిసిందే. ప్రియాంక-నిక్‌ జోనస్ దంపతులు సరోగసని విధానంలో ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని వారు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘సరోగసీ ద్వారా మాకు బిడ్డ పుట్టింది. ఈ ఆనందకరమైన సమయాన్ని మా కుటుంబంతో కలిసి ఆస్వాదించాలనుకుంటున్నాం. దయచేసి మా గోప్యతకు భంగం కలిగించకండి’ అంటూ అప్పట్లో ప్రియాంక ఈ విషయాన్ఇన అభిమానులతో పంచుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
2 నిమిషాల్లో మెహందీ, గోరింటాకు మచ్చలకు గుడ్‌బై చెప్పేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగే.. కేంద్రం నుంచి కీలక అప్డేట్..
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
ఉల్లిపాయ‌ పొట్టు ప‌డేస్తున్నారా? అందులోని ఆరోగ్య గుట్టు తెలిస్తే
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
SRH Vs RCB కాదు.. బెంగళూరు వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఇది..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
సంవత్సరాలు గడిచిన తగ్గని క్రేజ్.. దెబ్బకు ఆ ముగ్గురు హీరోయిన్లు..
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
మీ కిడ్నీలు పదిలంగా ఉండాలా?అయితే రోజుకు ఎన్ని గ్లాసుల నీరు తాగాలి
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
కస్టమర్లకు అలర్ట్.. దేశవ్యాప్తంగా బ్యాంకులు బంద్
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
మీ చేతి వేళ్ల ఆకారాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు!
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..