Viral Video: జై సాయిరాం అనమంటే.. జై బాలయ్య అంటున్న చిన్నోడు.. నటసింహం క్రేజీ లిటిల్ ఫ్యాన్

నందమూరి బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే 2 రోజుల ముందు నుంచే పూనకాలు మొదలవుతాయి.

Viral Video: జై సాయిరాం అనమంటే.. జై బాలయ్య అంటున్న చిన్నోడు.. నటసింహం క్రేజీ లిటిల్ ఫ్యాన్
Little Balayya Fan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 27, 2022 | 2:57 PM

Nandamuri Balakrishna: డైలాగ్ చెప్పాలన్నా ఆయనే.. మీసం తిప్పాలన్నా ఆయనే.. తొడ కొట్టాలన్నా ఆయనే.. సరికొత్త ప్రయోగాలు చేయాలన్నా ఆయనే… తెలుగు ఇండస్ట్రీలో రాజసానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య. ముక్కుసూటి తత్వం.. ఏదైనా కుండబద్దలు కొట్టే వ్యక్తిత్వం… నిష్కల్మషమైన మనస్తత్వం నందమూరి బాలకృష్ణది. అన్న ఎన్టీఆర్(Sr NTR) నటవారసుడిగా లెగసీని కంటిన్యూ చేస్తున్నారు బాలయ్య. పౌరాణికాలతో పాటు జానపద చిత్రాలతో సైతం నటించిన బాలయ్య… మాస్ సినిమాలతో మరింత మెప్పించారు. ఇటీవల వచ్చిన ‘అఖండ'(Akhanda) గర్జనకు బాక్సాపీస్ రికార్డులు బద్దలవ్వగా.. అనంతరం ఓటీటీ హాట్ స్టార్‌లో రిలీజ్ చేయగా సబ్‌స్రిప్షన్స్ మోత మోగిపోయింది. కేవలం నటుడిగానే కాదు, టాక్ షో హోస్ట్‌గా.. హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్‌గా పలు రంగాల్లో సేవలందిస్తున్నారు నటసింహం.  జై బాలయ్య అనేది స్లోగన్ కాదు.. ఓ ఎమోషన్. అందుకే ఏ హీరో సినిమా థియేటర్‌కి వెళ్లినా ఈ స్లోగన్ మాత్రం పక్కాగా వినిపిస్తుంది. బాలయ్యకు ఫ్యాన్స్ ఉండరు.. భక్తులు ఉంటారు. అవును.. కావాలంటే ఈ బుడ్డోడ్ని చూడండి.

చూశారా.. ఆ బుడ్డోడు ‘జై బాలయ్య’ అంటూ దేవుడి పటాల ముందు పూజలు చేస్తున్నాడు. ఆ చిన్నోడి మదర్ ‘జై సాయిరాం’ అనమని చెప్పినా సరే.. ‘జై బాలయ్య’ అనే అంటున్నాడు. ఈ బాలయ్య లిటిల్ ఫ్యాన్.. యూఎస్ లో నివశిస్తున్నట్లు తెలిసింది. ప్రజంట్ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఆహా’లో వచ్చిన అన్‌స్టాపబుల్ షో తర్వాత బాలకృష్ణ జనాలకు బాగా దగ్గరయ్యారు. ఆయన గురించి విపరీతమైన పాజిటివిటీ స్ప్రెడ్ అయ్యింది. ఈ సీనియర్ హీరో అసలు వ్యక్తిత్వం జనాలకు తెలిసింది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి