Krishna Vamsi: లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ.. ఈ క్రియేటివ్ డైరెక్టర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..? 

క్రియేటివిటీకి మారుపేరు ఈ స్టార్ డైరెక్టర్.. ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు కృష్ణవంశీ. సిందూరం లాంటి పవర్ఫుల్ ఎమోషనల్ మూవీ తర్వాత కృష్ణవంశీ ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించడం మొదలు పెట్టారు.

Krishna Vamsi: లాంగ్ గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ.. ఈ క్రియేటివ్ డైరెక్టర్ మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా..? 
Krishna Vamsi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 27, 2022 | 3:16 PM

క్రియేటివిటీకి మారుపేరు ఈ స్టార్ డైరెక్టర్.. ఫ్యామిలీ సినిమాలకు పెట్టింది పేరు కృష్ణవంశీ(Krishna Vamsi). సిందూరం లాంటి పవర్ఫుల్ ఎమోషనల్ మూవీ తర్వాత కృష్ణవంశీ ఫ్యామిలీ సినిమాలను తెరకెక్కించడం మొదలు పెట్టారు. మహేష్ బాబు కెరీర్ లో మొట్టమొదటి మైలు రాయిగా నిలిచినా మురారి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. నాగార్జునను రొమాంటిక్ హీరోగా ఎలివేట్ చేస్తూ నిన్నే పెళ్లాడతా లాంటి సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఖడ్గం లాంటి దేశ భక్తి సినిమాతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న కృష్ణవంశీ ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారు. చివరిగా ఆయన తెరకెక్కించిన నక్షత్రం సినిమా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. ఈ మూవీ 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవంశీ ఇప్పుడు రాగమార్తాండ సినిమాతో రానున్నారు.

ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం రంగమార్తాండ. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమా పై ఆసక్తి నెలకొంది. ఆ మధ్య ఈ మూవీలో బ్రహ్మానందం లుక్ ఒకటి బయటకు వచ్చి హల్ చల్ చేసింది. ఈ సినిమాలో బ్రహ్మానందం విభిన్నమైన పాత్రలో నటించనున్నారని అంటున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.రంగమార్తాండ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్, అలీ రేజా తదితరులు నటించారు. త్వరలో ఈ సినిమాకు సంభందించిన మరిన్ని విశేషాలు చిత్ర యూనిట్ తెలుపనుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే కృష్ణవంశీ ఖాతాలో చాలాకాలం తర్వాత హిట్ పడినట్టు అవుతుంది. మరి ఈ క్రియేటివ్ డైరెక్టర్ రంగమార్తాండ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి 

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!