Samyuktha Menon : త్రివిక్రమ్ సిఫారసు.. ఈ హీరోయిన్‌కు మెగామూవీ సినిమాలో ఛాన్స్
సినిమాల్లో అవకాశాలు రావడం అంత సులభం కాదు. అందంతో పాటు టాలెంట్ కూడా చాలా అవసరం. దాంతో పటు కొద్దిపాటి అదృష్టం కూడా కావాలి. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇతర బాషల నుంచి తెలుగులో
సినిమాల్లో అవకాశాలు రావడం అంత సులభం కాదు. అందంతో పాటు టాలెంట్ కూడా చాలా అవసరం. దాంతో పటు కొద్దిపాటి అదృష్టం కూడా కావాలి. ఇప్పుడు తెలుగు సినిమాలకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో ఇతర బాషల నుంచి తెలుగులో సినిమాలు చేయడానికి ముద్దుగుమ్మలు క్యూ కడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఎదురుచూస్తున్నారు. దానికి కారణం ఇక్కడి ప్రేక్షాభిమానమే.. కన్నడ నుంచి వచ్చిన రష్మిక(Rashmika Mandanna )ఇప్పుడు ఇక్కడ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు దక్కించుకొని పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. అలాగే తమిళ్ లో మాస్క్ అనే సినిమా తో ఎంట్రీ ఇచ్చిన పూజాహెగ్డే.. తెలుగు సినిమాలతోనే టాప్ హీరోయిన్ గా మారింది. కీర్తిసురేష్ కూడా తెలుగు సినిమాలతోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. మహానటి సినిమాను ఇప్పటికీ ఎవ్వరూ మర్చిపోరు. ఇలా చాలా మంది తెలుగు సినిమాలతోనే క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మరో మలయాళ భామ కూడా ఇక్కడ సినిమాలు చేసి స్టార్ డమ్ తెచ్చుకోవాలని ట్రై చేస్తోంది.
భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల భామ సంయుక్త మీనన్. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా సరసన నటించింది సంయుక్త. ఈ సినిమా హిట్ అయినప్పటికీ సంయుక్త కు అంతగా పేరు రాలేదు. దాంతో ఈ చిన్నది మరో తెలుగు సినిమా కోసం ఎదురుచూస్తోంది. ఈ సమయంలో ఆమెకు ఓ భారీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. `వినోదాయ సితం’ సినిమాకు రీమేక్ గా ఈ మూవీ రాబోతుంది. ఈ సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంయుక్తను త్రివిక్రమ్ సిఫార్స్ చేశారని టాక్ వినిపిస్తోంది. భీమ్లానాయక్ సినిమాలో సంయుక్త నటనకు మెచ్చి గురూజీ ఈ సినిమాలో ఈ చిన్నదానికి ఛాన్స్ ఇచ్చారట. ఇందులో సాయి ధరమ్ తేజ్ కు జోడీగా ఈ అమ్మడు కనిపించనుంది. ఈ సినిమా హిట్ అయితే సంయుక్త కూడా తెలుగులో వరుస ఆఫర్లు అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి