Bellamkonda Sai Sreenivas: హిందీ ఛత్రపతి ఏమైపోయాడు.? ఇంతకు ఉన్నట్టా..? లేనట్టా..?
అల్లుడు శ్రీను సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్. మొదటి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్నాడు శ్రీనివాస్..
అల్లుడు శ్రీను సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas). మొదటి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్నాడు శ్రీనివాస్.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించారు. ఇక రాక్షసుడు సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు బెల్లంకొండ. ఇక చివరిగా అల్లుడు అదుర్స్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దాంతో ఈ యంగ్ హీరో బాలీవుడ్ బాట పట్టారు. ఎలాగైనా హిందీలో హిట్ కొట్టాలని ప్రభాస్ ఛత్రపతి సినిమాను ఎంచుకున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది. దాంతో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు. టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.
అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. ఆ మధ్య పూజాకార్యక్రమాలు కూడా జరుపుకుంది ఈ సినిమా అయితే ఆ తర్వాత ఈ సినిమానుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ సినిమా హీరోయిన్ గురించి కొద్దిరోజులు చర్చలు జరిగాయి కానీ ఆతర్వాత ఆ వార్తలు కూడా రావడం ఆగిపోయాయి. ఇప్పుడు అస్సలు ఈ సినిమా గురించి ఊసే లేదు. అసలు సినిమా షూటింగ్ జరుగుతుందా..? లేక ఆగిపోయిందా..? అని అంతా చర్చించుకుంటున్నారు. అటు చిత్రయూనిట్ కూడా ఈ మూవీ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. అటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఈ సినిమా తప్పా మరో సినిమాను కమిట్ అవ్వలేదు. మరి ఇప్పటికైనా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ చిత్రయూనిట్ ఇస్తారేమో చూడాలి.