- Telugu News Photo Gallery Cinema photos Actress priyanka jawalkar giver clarity about her boy firend
Priyanka Jawalkar : ‘మా అమ్మ అడుగుతుంది.. దయచేసి అలాంటివి రూమర్లు మానేయండి’.. అంటున్న ప్రియాంక
టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar).. ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది
Updated on: Jun 27, 2022 | 9:53 PM

టాక్సీవాలా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంక జవాల్కర్

ఆ తర్వాత వచ్చిన ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది..

తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఓవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది ప్రియాంక.

ఇటీవల ఈ అమ్మడు షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆమె షేర్ చేసిన ఫోటోలో ఓ అబ్బాయి ముఖం కనిపించకపోవడంతో ఇద్దరు ప్రేమలో ఉన్నారని.. ఆ అబ్బాయి క్రికెటర్ అంటూ వార్తల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి

ఫోటోలో ఉన్న అబ్బాయి ఫోటో సెషన్ పనుల్లో మాకు సహయం చేయడానికి వచ్చాడు.. బాయ్ ఫ్రెండ్ అంటూ వస్తున్న వార్తల పై మా అమ్మ అడుగుతుంది..ఇక దీని గురించి మాట్లాడటం మానేస్తే బాగుంటుంది అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

మొత్తానికి తన ప్రేమాయణంపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టేసింది టాక్సీవాలా బ్యూటీ..




