R Madhavan: ఆ సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను.. ఆయన నిజమైన రాక్‏స్టా్ర్.. హీరో మాధవన్ ఆసక్తిక కామెంట్స్..

2016-2017లో త్రివేండ్రంలో నంబి సార్‌ను క‌లిశాను. ఆయ‌న క‌ళ్లు చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. కానీ బాధ‌తో క‌నిపించాయి. జైలులో ఉన్న సింహంలా అనిపించారు.

R Madhavan: ఆ సమయంలో నేను చాలా ఎమోషనల్ అయ్యాను.. ఆయన నిజమైన రాక్‏స్టా్ర్.. హీరో మాధవన్ ఆసక్తిక కామెంట్స్..
R Madhavan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 28, 2022 | 9:49 PM

ఆర్ మాధవన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.. అంతేకాకుండా.. ఎన్నో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లతో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్న హీరో ఆర్‌.మాధ‌వ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్’ . హీరోగా న‌టిస్తూ సినిమాను డైరెక్ట్ చేశారు మాధవన్. ట్రై క‌ల‌ర్ ఫిలింస్‌, వ‌ర్గీస్ మూలన్ పిక్చ‌ర్స్‌, 27 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై ఆర్‌.మాధ‌వ‌న్‌, స‌రితా మాధ‌వ‌న్‌, వ‌ర్గీస్ మూల‌న్‌, విజ‌య్ మూల‌న్ ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఈ సంద‌ర్భంగా హీరో, దర్శ‌కుడు ఆర్‌.మాధ‌వ‌న్ మాట్లాడుతూ ‘‘నంబి నారాయణన్‌గారిని నేను నంబి సార్ అని పిలుస్తుంటాను. నేను విక్ర‌మ్ వేద సినిమా చేసిన త‌ర్వాత ఇస్రో సైంటిస్ట్‌కి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన క‌థ ఉంది. ఆయ‌న మాల్దీవుల‌కు సంబంధించిన అమ్మాయితో సంబంధాన్ని క‌లిగి ఉన్నాడు. పాకిస్థాన్‌కు మ‌న దేశానికి చెందిన రాకెట్రీ సీక్రెట్స్‌ను అమ్మేశాడు. ఆ నేరం కింద ఆయ‌న్ని అరెస్ట్ చేసి చిత్ర హింస‌లు పెట్టారు. దాదాపు చంపినంత ప‌ని చేశారు. కానీ సీబీఐ చేసిన ద‌ర్యాప్తులో ఆయ‌న నిర‌ప‌రాధిగా నిరూపించ‌బ‌డ్డారు అనేదే క‌థ అన్నారు. నాకు చాలా బాగా న‌చ్చింది. పేద‌వాడి జేమ్స్ బాండ్ స్టోరి అనిపించింది.

2016-2017లో త్రివేండ్రంలో నంబి సార్‌ను క‌లిశాను. ఆయ‌న క‌ళ్లు చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉన్నాయి. కానీ బాధ‌తో క‌నిపించాయి. జైలులో ఉన్న సింహంలా అనిపించారు. ఆయ‌న నన్ను చాలా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ‘హాయ్ మాధవన్ నేను మీకు పెద్ద ఫ్యాన్. మీ సినిమాలను చూస్తుంటాను’ అని అన్నారు. కానీ కేసు గురించి మాట్లాడే సంద‌ర్భంలో న‌న్ను దేశ ద్రోహి అని ఎలా అంటారంటూ చాలా కోపంగా మాట్లాడారు. అప్పుడు నేను మాట్లాడుతూ ‘సార్.. ఈ కేసులో మీరు నిర్దోషి అని నిరూపించబడ్డారు కదా. ఇంకా కోప‌మెందుకు?’ అని అన్నాను. దానికాయ‌న ‘ఆ విషయం నీకు, నాకు, కోర్టుకి తెలుసు. కానీ గూగుల్‌కి వెళ్లి నా పేరు కొట్టి చూడు’ అన్నారు. నేను గూగుల్‌లో నంబి నారాయ‌ణ‌న్ అని కొట్ట‌గానే ఆయ‌న మ‌న‌దేశ ర‌హ‌స్యాల‌ను ప‌క్క దేశానికి చేర్చిన ర‌హ‌స్య గూఢ‌చారి అని ఉంది. ఆయ‌న బాధ‌లో నిజ‌ముంద‌నిపించింది. త‌ర్వాత నేను స్క్రిప్ట్ రాయ‌డానికి ఏడు నెల‌ల స‌మ‌యం తీసుకున్నాను. ఆయ‌న్ని వెళ్లి క‌ల‌వ‌గానే నేను ప్రిన్స్‌టిన్‌లో చ‌దువుకున్నాన‌ని అన్నారు. అక్క‌డా అంద‌రూ ఐదారేళ్లు తీసుకునే రీసెర్చ్‌ను కేవ‌లం ప‌ది నెల‌ల్లోనే పూర్తి చేశార‌ని చెప్పారు. ఆయ‌న ఇస్రో, నాసాల‌కు సంబంధించిన విష‌యాల‌ను గురించి చెబుతున్న‌ప్పుడు జేమ్స్ బాండ్ బాబులాగా అనిపించాడు. నిజ‌మైన రాక్ స్టార్‌. ఆయ‌న సాధించిన విజ‌యాల‌ను గురించి తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయాను. కానీ ఆయ‌నెప్పుడూ వాటి గురించి బ‌య‌ట‌కు చెప్పుకోలేదు. నేను చాలా ఎమోష‌న‌ల్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?