Matti Eddula Amavasya: మట్టికి రైతుకు విడదీయరాని బంధం.. వైభవంగా మట్టి ఎద్దుల ఉత్సవం..

మట్టి రైతుకు ఆశ.. మట్టి రైతుకు జీవనం..మట్టి రైతుకు బతుకు భరోసా.. మట్టిపైనే రైతు జీవితం ఆధారం..మట్టికి రైతుకు ఎంతో విడదీయరాని బంధం ఉంది. ఈ బంధాన్ని ఎప్పటికి ఎవ్వరు విడదీయలేనిది. మట్టిని ప్రతి ఏడాది రైతు ఏదో విధంగా పూజిస్తూనే ఉంటాడు.. అందులో ఒకటి మట్టి ఎద్దుల అమవాస్య..

Matti Eddula Amavasya: మట్టికి రైతుకు విడదీయరాని బంధం.. వైభవంగా మట్టి ఎద్దుల ఉత్సవం..
Matti Eddula Amavasya Festi
Surya Kala

|

Jul 01, 2022 | 10:11 AM

Matti Eddula Amavasya 2022: కర్నూలు జిల్లాలో పుడమి తల్లితో బసవన్న కు కర్షకుడికి ఉన్న అనుబంధం అమోఘం. కాడెద్దులను రైతన్నలు నడిచే దైవాలుగా భావించి ఏరువాక పౌర్ణమి, బసవ జయంతి పర్వదినాలను నిర్వహిస్తారు. సరిహద్దు రాష్ట్రం కర్ణాటక నుంచి సంక్రమించిన పండగలు ఇవి. ఇలాంటి మరో పండుగ మట్టి ఎద్దుల అమావాస్య. రైతులు ఎంతో రమణీయంగా చేసుకునే ఈ వేడుక పక్షిమ పల్లెల్లో ఆచారంగా వస్తుంది. మంత్రాలయం, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, నియోజకవర్గాల్లో ప్రతి ఏటా ఖరీఫ్ లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివరాల్లోకి వెళ్తే..

ఇవి కూడా చదవండి

  1. కర్ణాటక నుంచి సంక్రమించిన పండగ: కర్నూలు జిల్లా కౌతాళం మండలం కామవరం లో మట్టి ఎద్దుల పండుగ అమోఘం. మట్టి బసవన్నలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టి ఎద్దులను పూజిస్తే పంటలు బాగా పండుతాయి. వర్షాలు బాగా కురుస్తాయి. రైతులు ఆరోగ్యాలు కూడ బాగుంటుందని నమ్మకం. అప్పట్లో ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం ఈ నియోజకవర్గాలు కర్నాటక బళ్లారి జిల్లాలో ఉండేవి. ఆనవాయితీగా ఈ పండుగలు చేస్తున్నాము. కర్ణాటక నుంచి సంక్రమించిన పండగ. 150 గ్రామాల్లో మట్టి ఎద్దుల అమావాస్య సంప్రదాయం. మట్టి విగ్రహాల మాటున ప్రగాఢ విశ్వాసం. రెండు రోజులుగా కొనసాగిన పర్వదినం పర్వదినం. ఏరువాక పౌర్ణమి తరువాత వచ్చే అమావాస్యనే ఇక్కడ మట్టి మంటి ఎద్దుల అమావాస్య. వానలు కురవడం, విత్తు వేసుకునే తరుణంలో ఈ పండుగ వస్తుంది. అమావాస్య తిథి రోజు మట్టితో చేసిన జోడెద్దుల దులను ఇంట్లో కొలువుంచి చూడముచ్చటగా అలంకరణ చేస్తారు. పిండివంటలతో నైవేద్యాలు సమర్పించి ఎంతో పవిత్రంగా విశేష పూజలు చేస్తారు. సాయంత్రం వేళ కొందరు ప్రత్యేక వాహనాలపై మరి కొందరు చేతుల్లో ఉంచుకుని డప్పులు, మంగళవాయిద్యాలు మధ్య ఊరేగింపు నిర్వహించి గ్రామ దేవతలకు నారికేళాలు సమర్పిస్తారు. గ్రామంలోని బసవేశ్వర ఆలయం లేదా శివాలయం చేరుకొని అక్కడ మట్టి ఎద్దులను కొలువుంచి శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. అక్కడి నుంచి మట్టి ఎద్దులను ఇళ్లకు తీసుకెళ్లి ఇళ్లలో దూలాలు, పైకప్పులపై ఏడాదంతా ఉంచుతారు. కొందరు శివాలయంలో వదిలి వెళ్ళిన ఎద్దులను నదుల్లో నిమజ్జనం చేస్తారు. కొన్ని గ్రామాల్లో ఆలయ గోపురాలు, ఆలయ ప్రాంగణాల్లోను కొలువు చేస్తారు…. పశ్చిమ పల్లెల్లో కొనసాగిన ఆచారం.. కర్ణాటక సరిహద్దు ప్రాంతం పల్లెల్లో ఈ పండుగ ఎంతో ఘనంగా చేసుకున్నారు.
  2. 150 గ్రామాల్లో వేడుకలు: మంత్రాలయం ఆదోని ఆలూరు నియోజకవర్గాల్లో 150 గ్రామాల్లో వేడుకలు జరుపుకున్నారు.. మంత్రాలయం నియోజకవర్గంలో 60 పల్లెల్లో ఈ పండగ చేసుకున్నారు. కౌతాళం మండలం లోని కామవరం, హాల్వి, నదిచాగి, కోసిగి మండలంలో జుమ్మలదిన్నె, కందుకూరు, మూగలదొడ్డి, చిన్న బొంపల్లి, పెద్ద బొంపల్లి, తుమ్మిగనూరు, డి బెళగల్, అగసనూరు గ్రామాల్లో ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం, గోనెగండ్ల మండలాల్లో ఈ వేడుకను పెద్దఎత్తున చేసుకున్నారు.
  3. సంప్రదాయంపై ప్రగడ విశ్వాసం: మట్టి తో కూడిన వేడుక సంప్రదాయం వెనుక ప్రగాఢ విశ్వాసం దాగి ఉంది. మట్టి ఎద్దులకు పూజలు చేస్తే నేలతల్లికి కూడా పూజ చేసినట్టే అని వారి నమ్మకం. మట్టి ఎద్దుల అమావాస్య పర్వం జరుపుకుంటే సుభిక్షంగా ఉంటామని చెబుతున్నారు. సమృద్ధిగా వానలు కురిసి, పంటలు బాగా పండుతాయని ఇక్కడి రైతులు గట్టిగా విశ్వసిస్తున్నారు. కాడెద్దుల సైతం అనారోగ్యం దరిచేరదని భావిస్తారు. ఈ నేపథ్యంలో అమావాస్యను పురస్కరించుకుని మంగళ, బుధవారాలు రెండు రోజులు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
  4. మట్టి ఎద్దుల తో ఉపాధి: మట్టి ఎద్దుల పండగ లో ప్రకృతి పరమార్ధం సైతం దాగి ఉంది. కాలుష్యానికి తావు లేకుండా స్వచ్ఛమైన మట్టి విగ్రహాలను పూజకు వినియోగిస్తారు. ఫలితంగా మట్టి విగ్రహాల కళాకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది .వేలల్లో మట్టి ఎద్దుల విగ్రహాలను అమావాస్య రోజున విక్రయిస్తారు. కుమ్మరి వృత్తి కళాకారులు ఎక్కువగా ఈ మట్టి విగ్రహాలను తయారు చేస్తారు. కౌతాళం, ఆదోని, ఆలూరు, కోసిగి, ఈ ప్రాంతాల్లో కళాకారులు ఉన్నారు. జోడి విగ్రహాలను రూ. 40 నుంచి 60 రూపాయల చొప్పున విక్రయించారు. ఈ సారి నాలుగు నియోజకవర్గాల్లోనే దాదాపు 50 వేల మట్టి ఎద్దుల విగ్రహాలు విక్రయాలు జరిగినట్లు అంచనా..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu