- Telugu News Photo Gallery Business photos Top Affordable Cars in indian market with best mileage maruti suzuki alto k10, celerio, tata tiago
Affordable Cars: భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
Top Affordable Cars in Indian Market: ప్రతి ఒక్కరూ తక్కువ ధరల్లో కారు కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. 5 లక్షల లోపు ధర ఉండే అలాంటి కార్ల గురించి తెలుసుకుందాం. ఇందులో అద్భుతమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. తక్కువ ధరల్లో కారు కొనుగోలు చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ అనే చెప్పాలి. దేశంలో అత్యంత చవకైన కార్లు ఏవో చూద్దాం.
Updated on: Dec 24, 2024 | 6:57 PM


మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10): మారుతి సుజుకి ఆల్టో కె10. ఇది బెస్ట్ సెల్లర్. కంపెనీ ఆల్టో కె10లో 1-లీటర్ డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 67PS పవర్, 89Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా ఐచ్ఛిక ఐదు-స్పీడ్ AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో ఉంటుంది. దీనితో పాటు, ఆల్టో కె10 సిఎన్‌జి వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉంది. ఐడిల్-ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ కూడా ఇందులో అందుబాటులో ఉంది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.3.99 లక్షలు.

మారుతీ సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio): మరో కారు మారుతి సుజుకి సెలెరియో. ఇది చౌక కార్లలో ఇదొకటి. సెలెరియోలో 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 67bhp శక్తిని, 89nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సెలెరియో ప్రారంభ ధర రూ.5 లక్షల 36 వేలు. ఇది ఇండియన్ మార్కెట్లో మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

టాటా టియాగో (Tata Tiago): మూడో కారు టాటా టియాగో. ఈ కారు మీ బడ్జెట్ విభాగంలో ఖచ్చితంగా సరిపోతుంది. ఈ టాటా కారులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ గరిష్టంగా 86bhp శక్తిని, 113nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. టియాగోలో మీరు CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా ఉంటుంది. భారతీయ మార్కెట్లో మీరు టాటా టియాగోను రూ. 4 లక్షల 99 వేల ప్రారంభ ధరతో లభిస్తుంది.

మారుతీ సుజుకి S-ప్రెస్సో (Maruti Suzuki S-Presso): మీ బడ్జెట్‌కు సరిపోయే నాల్గవ కారు మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.26 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఆల్టో కె10 ఇంజన్ ఎస్-ప్రెస్సోలో అందుబాటులో ఉంది. ఈ కారు బేస్ వేరియంట్ రూ. 5 లక్షల లోపు వస్తుంది. S ప్రెస్సోలో 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది 68PS పవర్, 90Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.




