Puri Rath Yatra: నేడు జగన్నాథుడు రథయాత్ర.. రథాన్ని లాగడం భక్తులు వరంగా భావిస్తారన్న ఉపరాష్ట్రపతి వెంకయ్య..
ఒడిశాలోని పూరీ నగరంలో అత్యంత ప్రముఖమైన హిందూ పండుగ జగన్నాథుడి రథయాత్ర. ఈ పండుగ ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో ఆషాఢమాసంలో వచ్చే శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది. ఈ సంవత్సరం ఉత్సవం జూలై 1న వచ్చింది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు.
Puri Rath Yatra: ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ నేడు జగన్నాథుని ప్రసిద్ధ రథయాత్ర ఉత్సవాన్ని జరుపుకోవడానికి రెడీ అయింది. జగన్నాథుడి రథయాత్రను ప్రారంభించే ముందు.. సాంప్రదాయ ఆచారాలను పాటించారు. అనంతరం.. జగన్నాథుడు , దేవి సుభద్ర, బలరాముడుకి చెందిన మూడు రథాలను గురువారం ఆలయం సింహద్వారం ముందు ఉంచారు. నేడు యాత్ర జరగనుంది. ఈ రథయాత్ర ఉత్సవాలకు వచ్చే జనాన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రఖ్యాత ఇసుక కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒక సందేశంతో అద్భుతమైన ఇసుక కళను రూపొందించారు. ఈ రథయాత్రలో.. “ఒకేసారి ఉపయోగించే ప్లాస్టిక్‌కు వాడుకకు గుడ్ బై చెబుదాం” అని ప్రతిజ్ఞ చేద్దాం అనే సందేశాన్ని ఇచ్చారు.
పూరి జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ” రథయాత్ర శుభ సందర్భంగా మన దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. విష్ణువు అవతారంగా భావించే భగవంతుడు జగన్నాథుని వార్షిక యాత్ర ఘనముగా జరగబోతుందని అన్నారు. ఈ రథయాత్రలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారని.. భగవంతుని దయ ప్రజలపై ఉంటుందని ”అని ఆయన అన్నారు. అంతేకాదు ఈ రథయాత్రలో జగన్నాథుని రథాన్ని లాగడం తమ వరం అని భక్తులు భావిస్తారని పేర్కొన్నారు. రథయాత్ర వైభవం.. నిజంగా అసమానమైనది. రథయాత్రతో ముడిపడి ఉన్న పవిత్రమైన , గొప్ప ఆదర్శాలు మన జీవితాలను శాంతి , సామరస్యాలతో సుసంపన్నం చేస్తాయన్నారు వెంకయ్య నాయుడు.
భగవంతుడు జగన్నాథుడు , దేవి సుభద్ర , బలభద్ర భగవానుల రథోత్సవం అని కూడా పిలువబడే రథయాత్ర.. ఒడిశాలోని పూరీ నగరంలో అత్యంత ప్రముఖమైన హిందూ పండుగ. ఈ పండుగ ప్రతి సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో ఆషాఢమాసంలో వచ్చే శుక్ల పక్షం రెండవ రోజున జరుగుతుంది. ఈ సంవత్సరం ఉత్సవం జూలై 1న వచ్చింది.
ప్రతి సంవత్సరం వార్షిక రథోత్సవం కంటే ముందుగా మూడు రథాలు కొత్తగా నిర్మిస్తారు. ప్రకాశవంతమైన రంగులు, ఉత్సాహభరితమైన వాతావరణం, రద్దీగా ఉండే దుకాణాలు, కళాకారులు, భారీ సంఖ్యలో భక్తుల సందడి..తో పూరీ జగన్నాథుడు రథయాత్ర అంగరంగ వైభవంగా సాగుతుంది.
#WATCH Ahmedabad, Gujarat | Union Home Minister Amit Shah performs ‘Mangal Aarti’ at Shree Jagannathji Mandir ahead of the 145th Lord Jagannath Rath Yatra which commences from today pic.twitter.com/brwjXjOqBo
— ANI (@ANI) June 30, 2022
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..