Horoscope Today: వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది.. ఆర్థికంగా సానుకూలం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today (01-07-2022): ఏ పని మొదలు పెట్టాలన్నా, శుభాకార్యాలు జరపాలన్న మంచి ముహూర్తాలు తప్పకుండా చూస్తారు.. తమకు అన్ని విధాలా అనుకూలమైతైనే ఆ పనులు మొదలపెడతారు. ఇక మనలో చాలామంది ఉదయం లేవగానే
Horoscope Today (01-07-2022): ఏ పని మొదలు పెట్టాలన్నా, శుభాకార్యాలు జరపాలన్న మంచి ముహూర్తాలు తప్పకుండా చూస్తారు.. తమకు అన్ని విధాలా అనుకూలమైతైనే ఆ పనులు మొదలపెడతారు. ఇక మనలో చాలామంది ఉదయం లేవగానే తమతమ రాశి ఫలాలు (Rashi Phalalu) ఎలా ఉన్నాయో చూసుకుంటారు. వారి రాశి ఫలాలను బట్టి ఆరోజు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. అనుకూల సమయాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి. రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై1 (శుక్రవారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
మేషం
చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యం. నూతన కార్యక్రమాలు, పనులను కుటుంబ సభ్యుల సమ్మతంతోనే ప్రారంభించడం ఉత్తమం. ఒక శుభవార్త వింటారు. శత్రువులకు దూరంగా ఉండడం మంచిది. ఇష్టదేవతలను ఆరాధిస్తే మంచి కలుగుతుంది.
వృషభం
దైవబలం తోడుగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విందులు ,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. లక్ష్మీదేవి దర్శించుకోవడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
మిథునం
శ్రమకొద్దీ ఫలితాలుంటాయి. కీలక వ్యవహారాల్లో తోటివారి సాయం అందుతుంది. ధైర్యంతో ముందుకు అడుగేయాలి. అప్పుడే సానుకూల ఫలితలు పొందుతారు.శివారాధన మేలు చేకూరుస్తుంది
కర్కాటకం
వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. శివుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.
సింహం
ఈరాశివారికి మిశ్రమకాలం. లక్ష్యాలను సాధించే క్రమంలో ఒత్తిడిని ఎదురవుతుంది. ఇన్నాళ్లుగా మీకు అనుకూలంగా ఉన్నవాళ్లు వ్యతిరేకంగా మారుతారు. కీలక వ్యవహరాల్లో అప్రమత్తంగా ఉండాలి. గణపతి సహస్రనామ పారాయణ పఠిస్తే శుభకరం.
కన్య
చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. తోటివారు సమయానికి ఆదుకుంటారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. లింగాష్టకం పఠిస్తే మంచిది.
తుల
వీరికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా సానుకూలం. నూతన వస్తువులు కొంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. విష్ణుదేవుడిని పూజిస్తే శుభం కలుగుతుంది.
వృశ్చికం
అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి. కీలక పనుల్లో స్పష్టత అవసరం. ప్రశాంతంగా ఆలోచించాలి. ఆంజనేయ దర్శనం ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.
ధనస్సు
తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు తీసుకుంటారు. అనవసర ఖర్చులు జరగకుండా చూసుకోవాలి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. లి. ఈశ్వరుడిని దర్శించుకుంటే శుభం కలుగుతుంది
మకరం
చిత్తశుద్ధితో పనిచేస్తే సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఒక శుభవార్త మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధు, మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది.
కుంభం
కీలక వ్యవహారాల్లో తోటివారి సహకారం ఉంటుంది. ఒక శుభవార్త మనసుకు ఆనందాన్ని కలిగిస్తుంది. కీలక వ్యవహారంలో సమయానుకూలంగా స్పందింంచాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సూర్య దేవుడిని ఆరాధిస్తే మేలు చేకూరుతుంది.
మీనం
ఆలోచనలు స్థిరంగా ఉండాలి. ప్రారంభించిన పనుల్లో వెనక్కు తగ్గకూడదు. కొన్ని వ్యవహారాలలో మనోధైర్యం ప్రదర్శించాలి. ఎట్టిపరిస్థితిల్లోనూ నిర్లక్ష్యాన్ని దరిచేరనీయకండి. శివధ్యానం శుభప్రదం.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..