Horoscope Today: వీరికి రుణ బాధలు ఎక్కువవుతాయి.. కలహ సూచనలు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today (02-07-2022): ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు

Horoscope Today: వీరికి రుణ బాధలు ఎక్కువవుతాయి.. కలహ సూచనలు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Basha Shek

|

Jul 02, 2022 | 5:56 AM

Horoscope Today (02-07-2022): ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏరంగంలోని వారైనా రోజులో ఏ కొత్త పనులు మొదలు పెట్టాలన్నా , ఎక్కడికైనా ప్రయాణం చేయాలన్నా మంచి చెడుల గురించి ఆలోచిస్తారు. ఈరోజు తమకు ఎలా ఉంటుందో అని ఆలోచిస్తారు. వెంటనే తమ దినఫలాల( Daily Horoscope) వైపు చూస్తారు. అనుకూల సమయాలు చూసుకుని ఏ పనులు చేపడితే ఎలాంటి లాభాలు ఉంటాయి? రోజులో ఎలా ముందుకు సాగాలి అనే విషయాలపై దృష్టి సారిస్తుంటారు. మరి జులై 2 (శనివారం)న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

మేషం

ఉద్యోగ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. గొడవలు, కలహాలకు దూరంగా ఉండాలి. వేంకటేశ్వరస్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.

వృషభం

మనోధైర్యంతో ముందుకు సాగాలి. అప్పుడే అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బంధు, మిత్రులను కలుస్తారు. రుణ బాధలు ఎక్కువవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివుడిని పూజిస్తే మేలు జరుగుతుంది.

మిథునం

మనోబలంతో చేట్టిన రంగాల్లో విజయాలను సొంతం చేసుకుంటారు. ఆలోచనల్లో స్థిరత్వం ఉండాలి. నిర్ణయాల్లో తరచూ మార్పుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువులతో సఖ్యతగా వ్యవహరించాలి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే సానుకూల ఫలితాలు పొందుతారు.

కర్కాటకం

సంతోషకరమైన వార్తలె వింటారు. ఆత్మీయులు సహకారం అందుతుంది. సానుకూల ఫలితాలు పొందుతారు. ధనలాభం సూచకం. గొడవలు, వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకుంటే శుభప్రదం.

సింహం

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అప్పుడే మంచి ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఉత్తమ ఫలితాల కోసం దుర్గా అష్టోత్తర శతనామావళి పఠించాలి.

కన్య

ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి పనుల గురించి ఆలోచిస్తారు. విందులు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వరుడిని సందర్శించుకుంటే మంచిది.

తుల

శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్య వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సూర్యాష్టకం చదివితే మేలు జరుగుతుంది.

వృశ్చికం

కీలక వ్యవహారాల్లో సన్నిహితుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొన్ని కీలక వ్యవహారాలలో సమయ స్ఫూ్ర్తిగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఇష్టదైవారాధన మంచిది.

ధనస్సు

వృత్తి,ఉద్యోగ,వ్యాపారాలలో ఆచితూచి అడుగేయాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడాలి. దుర్గాదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.

మకరం

అందరినీ కలుపుకొనిపోవాలి. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీలక వ్యవహారాలలో ముందుకు వెళతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్థన మేలు చేకూరుస్తుంది.

కుంభం

విందులు, వినోదాలు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలక నిర్ణయాలలో వారి సహకారం మీకు లాభిస్తుంది. వేంకటేశ్వరుడిని ఆరాధిస్తే మంచిది.

మీనం

కుటుంబీకులు, బంధువులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని వ్యవహారాలలో ఆర్థికలాభం పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో మార్పులుంటాయి. ఇష్టదేవతలను పూజిస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu