Pat Cummins: వార్నీ.. ఇదేం బాదుడురా అయ్యా.. భారీ సిక్సర్‌ బాదిన ఆసీస్‌ కెప్టెన్‌.. బంతి ఎక్కడ పడిందో తెలుసా?

Australia Vs Sri Lanka: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) భారీ సిక్సర్ కొట్టాడు. ఎంత బలంతో కొట్టాడో గానీ ఆ బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది. కమిన్స్ కొట్టిన ఈ షాట్..

Pat Cummins: వార్నీ.. ఇదేం బాదుడురా అయ్యా.. భారీ సిక్సర్‌ బాదిన ఆసీస్‌ కెప్టెన్‌..  బంతి ఎక్కడ పడిందో తెలుసా?
Pat Cummins
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2022 | 9:02 AM

Australia Vs Sri Lanka: గాలే వేదికగా శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) భారీ సిక్సర్ కొట్టాడు. ఎంత బలంతో కొట్టాడో గానీ ఆ బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది. కమిన్స్ కొట్టిన ఈ షాట్ ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అందరినీ విస్మయానికి గురి చేసింది. స్టేడియంలోని అభిమానులు సైతం నోరెళ్లబెట్టారు. వార్నీ.. ఇదేం బాదుడురా అయ్యా.. అని అందరూ అవాక్కయ్యారు. ఐపీఎల్‌లో కోల్‌కతానైట్‌ రైడర్స్‌ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఈ ఆల్‌రౌండర్‌ ఈ సీజన్‌లోనూ కొన్ని మెరుపు ఇన్నింగ్స్‌ లు ఆడాడు. అందులో ముంబైపై ఏకంగా 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి తన అదుర్స్‌ అనిపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..శ్రీలంక తన తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇక అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 318 పరుగులు చేసింది. ఆసీస్ ఓపెనర్ ఖవాజా (71), కెమరూన్ గ్రీన్ (77) అర్ధ సెంచరీలతో రాణించారు. అలెక్స్ క్యారీ 47 బంతుల్లో 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ 16 బంతుల్లో 26 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. కమిన్స్‌ ఇన్నింగ్స్‌ లో మొత్తం 3 సిక్సర్లు ఉన్నాయి. అందులో ఓ సిక్సర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. లంక బౌలర్ జెఫ్రీ వాండర్ సే బౌలింగ్ లో బాదిన బంతి ఏకంగా స్టేడియం బయట ఉన్న రోడ్డుపై పడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!