IND vs ENG: వన్డేల్లోకి హార్దిక్‌, ధావన్‌ పునరాగమనం.. ఇంగ్లండ్‌తో T20I & ODI మ్యాచ్‌లకు భారత జట్టు ఇదే..

IND vs ENG 2022: ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారతజట్టును బీసీసీఐ ప్రకటించింది. కరోనా కారణంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

IND vs ENG: వన్డేల్లోకి హార్దిక్‌, ధావన్‌ పునరాగమనం.. ఇంగ్లండ్‌తో T20I & ODI మ్యాచ్‌లకు భారత జట్టు ఇదే..
Team India
Follow us
Basha Shek

| Edited By: Anil kumar poka

Updated on: Jul 01, 2022 | 9:02 AM

IND vs ENG 2022: ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌ల కోసం భారతజట్టును బీసీసీఐ ప్రకటించింది. కరోనా కారణంగా ఎడ్జ్‌బాస్టన్ టెస్టుకు దూరమైన రోహిత్ శర్మ టీ20, వన్డే సిరీస్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాగా కొవిడ్‌ కారణంగా గతేడాది వాయిదా పడిన ఈ రీషెడ్యూల్‌ టెస్ట్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. దీని తర్వాత ఆతిథ్య జట్టుతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ని ఆడాల్సి ఉంది. కాగా టెస్టుల్లో ఆడే ఆటగాళ్లకు పూర్తి స్థాయిలో విశ్రాంతి కల్పించాలని బీసీసీఐ భావించింది . ఈ కారణంగానే టెస్టు మ్యాచ్ ముగిసిన వెంటనే జరిగే టీ20 సిరీస్‌కు రెండు జట్లను ఎంపిక చేసింది.

మొదటి టీ20 మ్యాచ్ కి వారు దూరం..

ఇవి కూడా చదవండి

జూలై 1న ప్రారంభమయ్యే ఎడ్జ్‌బాస్టన్ టెస్టు జూలై 5న ముగియనుంది. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈక్రమంలో టెస్టులో పాల్గొనే ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించేందుకు ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడిన ఆటగాళ్లనే తొలి టీ20లో బరిలోకి దించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో రోహిత్ కూడా ఆడడు కాబట్టి అతను మొదటి టీ20లో ఆడతాడు. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రాలు మొదటి టీ20 మ్యాచ్‌లో ఆడరు. రెండు, మూడో టీ20ల్లో తిరిగి జట్టులోకి రానున్నారు.

వన్డేల్లోకి హార్దిక్‌, శిఖర్‌ పునరాగమనం..

ఐర్లాండ్‌లో టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా మళ్లీ వన్డే జట్టులోకి వచ్చాడు. గతేడాది జూలైలో అతను చివరి వన్డే ఆడాడు. దీంతో పాటు శిఖర్ ధావన్‌కు వన్డే సిరీస్‌కు కూడా అవకాశం కల్పించారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. తొలిసారి వన్డే జట్టులో కూడా అవకాశం దక్కించుకున్నాడు. కాగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు బీసీసీఐ జట్టులో చోటు కల్పించలేదు. తొలి టీ20లో మాత్రమే అతడు జట్టులో ఉంటాడు.

ఇంగ్లండ్‌ తో తలపడే భారత జట్టు ఇదే..

మొదటి టీ20 మ్యాచ్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్‌కీపర్‌), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్ మాలిక్

రెండు, మూడు టీ20 మ్యాచ్‌ల కోసం:

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), రిషబ్ పంత్ (వికెట్‌ కపీర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్

వన్డే సిరీస్:

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహమ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..