AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!

టీమిండియా 2026 టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకోవడంలో జస్ప్రీత్ బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి మూడోసారి టైటిల్ సాధించింది. బుమ్రా బౌలింగ్ ప్రదర్శన పట్ల సౌత్ ఆఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసలు కురిపించాడు. ఆ వివరాలు ఇలా..

Team India: టీంలో వాడు ఉన్నంత వరకు.. టీమిండియా వెంట్రుక కూడా పీకలేరు.!
Team India
Ravi Kiran
|

Updated on: Mar 18, 2026 | 11:45 AM

Share

టీమిండియా ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో ఓడించి, మూడోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయం గత కొన్నేళ్లుగా టీమిండియా సాధిస్తున్న వరుస విజయాలు, ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ ట్రోఫీలకు కొనసాగింపుగా నిలిచింది. ఈ విజయాల పరంపరలో కీలక పాత్ర పోషిస్తున్న ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా అగ్రస్థానంలో నిలుస్తాడనడంలో సందేహం లేదు.

బుమ్రా ప్రదర్శన 2024 టీ20 ప్రపంచకప్‌లోనూ, 2026 టోర్నమెంట్‌లోనూ అత్యద్భుతంగా ఉంది. 2024 ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో అతని స్పెల్ అందరికీ గుర్తుంది. ఆ టోర్నమెంట్ అంతటా టీమిండియా విజయాల్లో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఇక 2026 ప్రపంచకప్‌లోనూ తన బౌలింగ్ పరాక్రమాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉన్నప్పటికీ, ఈ టోర్నమెంట్ ఆసాంతం బౌలింగ్ విభాగంపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, బుమ్రా ఒక్కడే బౌలింగ్ దళాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ, ఒంటరి పోరాటం చేసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను గజగజ వణికించాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ వంటి కీలక మ్యాచ్‌లలో తన విశ్వరూపం చూపడంతోనే టీమిండియా భారీ విజయాలతో దూసుకుపోగలిగింది. ఫైనల్ మ్యాచ్‌లో బుమ్రా ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి, మ్యాచ్‌ను టీమిండియా సునాయాసంగా గెలిచేలా చేశాడు. దీనితో “టీమిండియాలో బుమ్రా ఉంటే ఐసీసీ ట్రోఫీలు టీమిండియావే” అన్న నమ్మకం అభిమానుల్లో బలంగా నాటుకుపోయింది.

ఈ అద్భుత ప్రదర్శనలపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లోనే బుమ్రా అత్యుత్తమ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని డివిలియర్స్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో అతన్ని మించిన బౌలర్ ఎవరూ లేరని పేర్కొన్నాడు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే, వాటిని తట్టుకుని ముందుకు సాగే సత్తా కేవలం బుమ్రాకు మాత్రమే ఉందని డివిలియర్స్ అభినందించాడు. తీవ్ర ఒత్తిడిని సైతం అధిగమిస్తూ మెరుగైన ప్రదర్శన ఇవ్వడం బుమ్రా ప్రత్యేకత అని ఆయన వ్యాఖ్యానించాడు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలపడంలో బుమ్రా పాత్ర చాలా కీలకమని డివిలియర్స్ ఉద్ఘాటించాడు. అంతేకాకుండా, రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్లలో కూడా బుమ్రా తనదైన శైలిలో చెలరేగిపోవడం ఖాయమని డివిలియర్స్ జోస్యం చెప్పాడు. బుమ్రా టీమిండియాలో ఉన్నంతకాలం, ఐసీసీ ట్రోఫీలకు టీమిండియాకు కొదవే ఉండదని ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Follow Us
అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
అల్లుడు అత్తమామలకు శ్రాద్ధం చేయవచ్చా? గరుడ పురాణం ఏం చెబుతోంది?
వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!
వయసు పెరిగినా యంగ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే.. ఇవి తప్పనిసరి!
గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..
గుండె మందంగా మారితే ఏమవుతుంది..? కార్డియాలజిస్ట్ సూచనలివే..
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
కాఫీ తాగిన వెంటనే బాత్రూంలోకి పరిగెడుతున్నారా?.. అసలు విషయమిదే
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
యవ్వనశక్తి, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరికాయ చుందా
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
వన్డే హిస్టరీలో ఆల్‌టైం టాప్ 7 భారీ స్కోర్లు
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..
పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..