AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇదో రకం పిచ్చంటారు..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని..షాకింగ్‌ వీడియో వైరల్‌

అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు వెలువడే లావా ఉష్ణోగ్రత 700 డిగ్రీల సెల్సియస్ నుండి 1,200 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అందులో పడ్డ మనిషి, ఏ జీవి అయినా సరే కొన్ని సెకన్లలోనే బూడిదగా మారిపోతారు. అలాంటిది వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి మండుతున్న అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లాడు..

Watch: ఇదో రకం పిచ్చంటారు..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని..షాకింగ్‌ వీడియో వైరల్‌
Man Lit A Cigarette Volcano
Jyothi Gadda
|

Updated on: Dec 24, 2024 | 7:30 PM

Share

సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం చాలా మంది తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. కొందరు మృత్యువుతో ఆడుకుంటారు. మరి కొందరు చావు అంచుల దాకా వెళ్లి తిరిగి వస్తారు. ఇంటర్‌నెట్‌లో ఫేమస్ అవ్వాలనే వ్యామోహంతో ప్రాణాలు పోతాయని తెలిసినా లైక్స్, వ్యూస్ వస్తూనే ఉండాలని ఆరాటపడుతుంటారు.. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వ్యక్తి మరణం అంచున నిలబడి ఉన్నాడు.. అగ్నిపర్వత లావా పారుతుండగా.. అందులో అతను సిగరెట్ వెలిగించుకుంటూ అందరినీ షాక్ అయ్యేలా చేశాడు.

అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు వెలువడే లావా ఉష్ణోగ్రత 700 డిగ్రీల సెల్సియస్ నుండి 1,200 డిగ్రీల సెల్సియస్ (1,292 ° F నుండి 2,192 ° F) వరకు ఉంటుంది. అందులో పడ్డ మనిషి, ఏ జీవి అయినా సరే కొన్ని సెకన్లలోనే బూడిదగా మారిపోతారు. అలాంటిది వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి తన స్నేహితులతో కలిసి మండుతున్న అగ్నిపర్వతం దగ్గరకు వెళ్లాడు.. అక్కడ ఏరులై పారుతున్న లావాతో అతను తన సిగరెట్ వెలిగించుకున్నాడు. ఇది చూసి ఆ వ్యక్తి స్నేహితులు ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్టుగా ఆనందిస్తారు. కానీ వాస్తవానికి అది మృత్యువుతో ఆడుకోవటం అని చెప్పాలి.. అగ్నిపర్వతం చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అక్కడ ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా కూడా మరణం ఖాయం అని అనిపిస్తుంది. చుట్టుపక్కల వ్యాపించిన వేడి లావా సెగలు గక్కుతుండగా, ఈ వ్యక్తి లావా సమీపంలోకి వెళ్లి, సిగరెట్ వెలిగించి, హాయిగా పొగ తాగుతున్నాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by BVIRAL (@bviral)

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన వెంటనే, ప్రజలు దానిని విస్తృతంగా షేర్ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు లక్షల మంది వీడియోను వీక్షించారు. చాలా మంది వీడియోను లైక్ చేశారు. అటువంటి పరిస్థితిలో సోషల్ మీడియా వినియోగదారులు వీడియోపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్‌ చేసే వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలంటూ చాలా మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..