42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే గుండెలు గుబేల్ అనాల్సిందే..

ఒళ్లు గగ్గుర్పొడిచే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది చూసిన చాలా మంది షాక్‌తో నోరెళ్లబెట్టారు. బైక్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ట్రక్‌ బంపర్‌లో ఇరుక్కుపోయారు.. అలాగే, ఆట్రక్‌ వారిని చాలా దూరం వరకు ఈడ్చుకెళ్లింది.. ఆ తర్వాత జరిగింది చూస్తే నిజంగే మిరాకిల్‌ అనే చెప్పాలి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే గుండెలు గుబేల్ అనాల్సిందే..
Truck Hits Bike
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 24, 2024 | 6:02 PM

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఒళ్లుగగ్గుర్పొడిచే వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. హైవేపై బైక్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు చనిపోయి ఉంటారనే భయంతో ట్రక్ డ్రైవర్ పట్టుబడకుండా ఉండేందుకు వేగంగా పారిపోయే ప్రయత్నం చేశాడు… అయితే బైక్ నడుపుతున్న ఇద్దరు యువకులు ట్రక్‌ ముందున్న బంపర్‌లో ఇరుక్కుపోయారు..సోషల్ మీడియాలో ఈ వీడియో వేగంగా షేర్‌ అవుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో చూసిన ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ట్రక్కు బంపర్‌లో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులు అరుపులు, కేకలు వేయడం కనిపిస్తుంది. వారి బైక్‌ను ఢీకొట్టిన ట్రక్‌ డ్రైవర్‌ మాత్రం అదేదీ పట్టించుకోకుండా పారిపోవాలని ప్రయత్నిస్తున్నాడు.. యువకులిద్దరూ జీవన్మరణానికి మధ్య పోరాడుతున్నారు. మరణం వారికి చాలా దగ్గరగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వారు ప్రాణాలతో బ్రతికి బయటపడటం నిజంగా ఒక అద్భుతం కంటే తక్కువ కాదు.

ఇవి కూడా చదవండి

ట్రక్కును ఆపాలని యువకులిద్దరూ వేడుకుంటూనే ఉన్నారు. కానీ ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయడం లేదు..ఎట్టకేలకు కొన్ని వాహనాలు ఆ ట్రక్‌ను ఓవర్‌టేక్ చేసి ఆపేందుకు ప్రయత్నించాయి. కొంతమంది వాహనదారులు తమ కార్లను ట్రక్కు ముందు పార్క్ చేశారు. దాంతో ట్రక్ డ్రైవర్ బ్రేకులు వేయవలసి వచ్చింది. దాంతో ఆగ్రహించిన ప్రజలు లారీ డ్రైవర్‌ను తీవ్రంగా కొట్టి పోలీసులకు అప్పగించారు.

వీడియో ఇక్కడ చూడండి..

లారీ ఆగిన తర్వాత బంపర్‌లో ఇరుక్కున్న యువకులిద్దరినీ బయటకు తీశారు. వారివురికి తీవ్ర గాయాలయ్యాయి. చాలా దూరం వరకు ట్రక్‌ వారిని ఈడ్చుకెళ్లడంతో ఇద్దరి శరీరాలు రక్తంతో నిండిపోయాయి. వారిద్దరినీ స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఆదివారం రాత్రి ఆగ్రాలోని ఛట్టా పోలీస్ స్టేషన్ ఏరియా పరిధిలో ఈ ఘటన జరిగినట్లు స్థానిక ఎస్పీ తెలిపారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపారు. యువకులిద్దరూ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ