AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఎద్దుల పోరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఓడిపోయింది..! ఏటీఎం ధ్వంసం

జంతువులు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ల వెంట వాహనాలు కూడా పాడవుతున్నాయి. ఇప్పుడు రెండు ఎద్దులు ఓ బ్యాంకు ఏటీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏటీఎం మెషీన్‌కు ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చాలా మంది భిన్నమైన కామెంట్స్‌తో స్పందించారు.

Watch: ఎద్దుల పోరులో బ్యాంక్ ఆఫ్ బరోడా ఓడిపోయింది..! ఏటీఎం ధ్వంసం
2 Bull Fights
Jyothi Gadda
|

Updated on: Dec 24, 2024 | 3:38 PM

Share

బహిర్భూమిలో సంచరించే జంతువులు సామాన్య ప్రజలు, రైతులకు హాని చేయడమే కాకుండా రోడ్డుపై నడుస్తున్న వాహనాలను ఢీకొట్టడంతో ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇప్పుడు ఈ జంతువులు ప్రభుత్వ ఆస్తులను కూడా ద్వంసం చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రెండు ఎద్దులు ఒక బ్యాంక్ ఏటీఎంను ఎలా ధ్వంసం చేస్తున్నాయో చూస్తే షాక్‌ అవుతారు.

వైరల్ వీడియోలో బ్యాంకు బయట రెండు ఎద్దులు పోరాడుతున్నాయి. ఈ రెండింటి మధ్య జరిగిన పోరును చూసేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వాటిని చెదర గొట్టేందుకు కూడా కొందరు ప్రయత్నించారు. కానీ అవి ఏ మాత్రం తగ్గటం లేదు…ఆ రెండు ఢీ కొంటూ.. బ్యాంకు ఏటీఎం ముందుకు వచ్చాయి. ఎద్దులు ఎటిఎమ్‌లోకి రాకుండా ఆపేందుకు అక్కడున్న వారు చాలా ప్రయత్నించారు. కానీ, ఏటీఎం విధ్వంసం జరిగిపోయింది. ఎద్దులు పోరాడుతూ ఒక్కసారిగా ఏటీఎం వైపు కదిలాయి…ఏటీఎం అద్దాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించాయి. అందరూ చూస్తుండగానే ఏటీఎంను ధ్వంసం చేశాయి. చివరకు కొందరు స్థానికులు కర్రలతో తరిమికొట్టే ప్రయత్నం చేయడంతో ఆ రెండు ఎద్దులు రోడ్డుపై పరుగులు తీశాయి.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

ఏటీఎం మెషీన్‌కు ఎంత నష్టం వాటిల్లిందనే దానిపై స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, చాలా మంది భిన్నమైన కామెంట్స్‌తో స్పందించారు. ఈ వీడియో తీస్తున్న వ్యక్తులు చాలా సంతోషంగా ఉన్నారని, వారికి కోహినూర్ దొరికినట్లు అనిపిస్తోందని సోషల్ మీడియా వినియోగదారు ఒకరు రాశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?
గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?